India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
DSC ఫలితాలు కాసపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో SGT పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ నిష్పత్తి
KNR 1086 90 (1:12)
PDPL 549 14 (1:39)
JGTL 1248 136 (1:09)
SRCL 1043 64 (1:16)
@ జగిత్యాలలో జానపద గాయకుడు మల్లిక్ తేజ పై కేసు. @ రాయికల్ మండలంలో జ్వరంతో బాలిక మృతి. @ శంకరపట్నం మండలంలో కారు బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ బెజ్జంకి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు డాక్టరేట్. @ రాయికల్ ఎస్సైగా సుధీర్ రావు బాధ్యతల స్వీకరణ. @ కరీంనగర్ లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం.
జగిత్యాల జిల్లా భీమారం మండలంలో దసరా సందర్భంగా పలువురు యువకులు వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో 12 రకాల ఆఫర్లు పెట్టారు. రూ.100తో లక్కీ డ్రా తీస్తే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతి నాటుకోడి పుంజు, ఇలా.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ 12 రకాల ఆఫర్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 11న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కరీంనగర్ మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం మేడారంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
నేడు (ఆదివారం) కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30 గం.లకి ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
@ జగిత్యాలలో బాలసదనం నుండి బాలిక మిస్సింగ్. @ ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో వృద్ధురాలు మృతి. @ జ్వరంతో బాధపడుతున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. @ పెగడపల్లి మండలంలో విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి. @ రుద్రంగి మండలంలో డెంగ్యూ ఫీవర్ తో వ్యక్తి మృతి. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఎస్ఐల బదిలీ, ఇద్దరు ఎస్ఐలపై వేటు. @ సిరిసిల్లలో ఘనంగా పోషణ మాసోత్సవం. @ కొండగట్టులో భక్తుల రద్దీ.
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధుల అంశాలే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాంగ్రెస్ తలగొక్కోంటోందని, ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పైపులైన్లు, కల్వర్టులకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, ఎన్పీడీసీఎల్ తదితరశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 8 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు శనివారం చేరుకున్నారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ ఉన్నత అధికారులు తదితరులు ఉన్నారు.
జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు SIలపై వేటు పడింది. ఓ si సస్పెండ్ కాగా.. మరో పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశారు. మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యప్రవర్తన కారణంగా జగిత్యాల జిల్లా రాయికల్ si అశోక్‌ను sp సస్పెండ్ చేశారు. కోరుట్ల SI శ్వేతను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ మల్టీజోన్ 1 IG ఉత్తర్వుల జారీచేశారు. భార్యా, భర్తల గొడవలో భర్త శివప్రసాద్‌ను SI శ్వేత కొట్టడంతో శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.