Karimnagar

News August 19, 2024

వేములవాడ: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

image

ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి మనస్తాపంతో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన గీసి శిరీష(20) సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శిరీష డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా, శిరీష అన్నయ్య తన చెల్లిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నట్లు వేములవాడ రూరల్ SI మారుతికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.

News August 19, 2024

బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి పరామర్శ

image

మల్యాల మండలం రామన్నపేట మాజీ సర్పంచ్ వకుళాభరణం శ్రీనివాస్, భార్య అరుణ ఇటీవల మరణించగా వారి కుమారుడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మల్యాలకు చెందిన గుండేటి గంగారాం భార్య ఇటీవల సూసైడ్ చేసుకోగా ఆయనను పరామర్శించి ఓదార్చారు. మద్దుట్ల గ్రామానికి చెందిన నరేందర్ చనిపోగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, వేణు, శ్రవణ్ ఉన్నారు

News August 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
@ వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
@ జగిత్యాల జిల్లాలో 165 డెంగ్యూ కేసులు నమోదు.
@ మెట్పల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.
@ జగిత్యాలలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం.
@ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు.

News August 18, 2024

కరీంనగర్: వాతావరణంలో అనూహ్య మార్పులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిరోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతిని, జ్వరాల బారిన పడుతున్నారు. కాగా ఈ నెల 19, 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే తెలిపింది.

News August 18, 2024

సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

image

బడుగు బలహీన వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడని కొనియాడారు.

News August 18, 2024

KTR కొడంగల్‌కు వస్తావా.. సిరిసిల్లకు వస్తావా: జగ్గారెడ్డి

image

రైతు రుణమాఫీ అమలుపై కొడంగల్‌కు వస్తావా.. సిరిసిల్లకు వస్తావా KTR అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి KTR విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. రైతులకు పదేళ్లలో BRS నేతలు చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించే సరికి ఎటూ పాలుపోక వింతగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

News August 18, 2024

డయల్‌ 100 కాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: కరీంనగర్ సీపీ

image

డయల్‌ 100 కాల్స్‌తో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీ అభిషేక్‌ మొహంతి అన్నారు. కమిషనరేట్‌ కేంద్రంలో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి రవాణాపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి NDPS చట్టం ద్వారా కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు.

News August 18, 2024

KTRకు నాలెడ్జ్ లేదు.. హరీశ్‌రావువి చిల్లర మాటలు: కోదండరెడ్డి

image

రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

News August 18, 2024

కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?

image

కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.

News August 18, 2024

ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు గడువు

image

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు మంథని డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త కృష్ణ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు కావలసినవారు వివరాలకు 73829 29649 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలన్నారు.