India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు జారీపై మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ ఇచ్చింది. దీంతో తొందర్లోనే కార్డులు రానున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లాలో 3317, పెద్దపల్లి జిల్లాలో 2436, కరీంనగర్ జిల్లాలో 5303, సిరిసిల్ల జిల్లాలో 1355 దరఖాస్తులు రేషన్ కార్డు కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామసమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.98 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిడ్‌మానేరు ద్వారా వచ్చిన 3,200 క్యూసెక్కుల నీటిని ఒక పంపు ద్వారా ఎత్తిపోస్తుండగా, ఎగువన ఉన్న రంగనాయకసాగర్‌కు 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
@ కోరుట్లలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి. @ మెట్పల్లిలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్. @ కరీంనగర్ ప్రజావాణిలో 267, జగిత్యాల ప్రజావాణిలో 56 ఫిర్యాదులు. @ కరీంనగర్ ఎల్ఎండి లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం. @ ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై చర్యలు ఉంటాయన్న సిరిసిల్ల కలెక్టర్. @ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమీక్షించిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. సంస్థ సాధించిన లాభాలలో సగం పక్కనపెట్టి మరో సగంలో 33% ఇవ్వటం సరైన విధానం కాదన్నారు. సంస్థ సాధించిన పూర్తి లాభాలలో 33 శాతాన్ని కార్మికులకు ఇస్తే ఒక్కొక్క కార్మికునికి రూ.4 లక్షలువచ్చే అవకాశం ఉందన్నారు.
కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,91,128 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.77,614, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,160, అన్నదానం రూ.68,354,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
పల్లె వెలుగు బస్సుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు సులభంగా ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సూపర్ లగ్జరీ లాంటి బస్సుల్లో ఈ సదుపాయం ఉండగా ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లోకి సైతం తీసుకొచ్చారు. కాగా ఉమ్మడి జిల్లాలో 11 డిపోలకు సంబంధించి 811 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 479 ఆర్టీసీ, 332 అద్దె బస్సులు నడుపుతున్నారు.
@ సిరిసిల్లలో షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ పోల్ దగ్ధం. @ గోదావరిఖని శివారు గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో రెస్టారెంట్ భవనంలో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సైగా రామ్మోహన్. @ పెగడపల్లి మండలం లో 500 గ్రాముల గంజాయి పట్టివేత. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు.
KU దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి SEP-30 దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 8341 3850 00 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.