India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జమ్మికుంట గడ్డపై కమలం వికసింపజేయాలని BJP తీవ్రంగా శ్రమిస్తోంది. BRS, కాంగ్రెస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని చాటిచెప్పేలా మొత్తం 30 వార్డుల్లోనూ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయవాదం, స్థానిక సమస్యలే అజెండాగా BJP అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈసారి ఖచ్చితంగా అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉత్సాహంతో కాంగ్రెస్ జమ్మికుంట మున్సిపాలిటీపై గురి పెట్టింది. “రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది.. మున్సిపాలిటీలోనూ గెలిపిస్తే నిధుల వరద పారిస్తాం” అనే అస్త్రంతో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 17 మంది రెబల్స్ చేత నామినేషన్లు విత్‌డ్రా చేయించి అసమ్మతిని చల్లార్చి జమ్మికుంట పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ‘హస్తం’ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో కరీంనగర్ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్మికుంటలోని 30 వార్డులకు 159 మంది, హుజురాబాద్‌లో 30 వార్డులకు 143 మంది, చొప్పదండిలో 14 వార్డులకు 64 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం రంగంలో ఉండటంతో ప్రచారం హోరెత్తుతోంది.

కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల చిత్రం స్పష్టమైంది. మొత్తం 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, బీఆర్‌ఎస్ (66 చొప్పున), కాంగ్రెస్ (65), ఫార్వర్డ్ బ్లాక్ (31), ఎంఐఎం (15), జనసేన (14), బీఎస్పీ (7) పోటీ పడుతున్నాయి. సీపీఐ, సీపీఐ-ఎంఎల్ నుంచి ఒక్కొక్కరు, ఇతర పార్టీల నుంచి 9 మంది, 123 మంది స్వతంత్రులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో బీజేపీ ముందడుగు వేసింది. మొత్తం 66 డివిజన్‌లకు బీజేపీ 66 పార్టీ టికెట్లను కేటాయించింది. దీంతో ఇప్పటి వరకు ఎవరికి టికెట్ వస్తుందనే ఉత్కంఠకు తెరపడింది. ఇక అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. నేటి నుంచి బీజేపీ అభ్యర్థుల తరుఫున కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టారు.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అభ్యర్థులు తమ పార్టీల అధికారిక ‘బి-ఫామ్’లను సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోపు పత్రాలు అందని పక్షంలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కేటాయింపుపై పార్టీల అగ్రనేతలు కసరత్తు కొనసాగిస్తుండగా, ఆశావహులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్‌కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.

KNRకు బడ్జెట్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్‌పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్‌టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 698 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. వీరు దాఖలు చేసిన 1,231 సెట్ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నగరంలో కొత్తగా విలీనమైన 6వ డివిజన్ (బొమ్మకల్) లో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32, 49వ డివిజన్లలో అత్యల్పంగా ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.

కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గజ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నీరాజనాలు పలికారు. గుర్రాలు, ఒంటెలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.