India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రేపటి నుంచి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 17,257 మంది విద్యార్థుల కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు RIO వి.గంగాధర్ తెలిపారు. హాల్ టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని హైదరాబాద్ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు.

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 1257 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థులు 374, బీజేపీ అభ్యర్థులు 309, కాంగ్రెస్ నుంచి 252 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి సైతం 55 మంది దరఖాస్తులు చేయగా వైసీపీ నుంచి పోటీలో ఎవరు నిలవలేదు. 93 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఈనెల 31 నుంచి యూరియా విక్రయాలు కేవలం ‘ఎరువుల బుకింగ్ యాప్’ ద్వారానే జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యాప్‌లో ముందే బుక్ చేసుకుని డీలర్ వద్ద కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టాదారు పాసుక్ మొబైల్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని, కౌలు రైతులు యజమాని ఓటీపీతో బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ గడువు మరుసటి రోజు అర్ధరాత్రి వరకే ఉంటుందని, రెండో విడతకు 15 రోజుల విరామం ఉంటుందన్నారు.

కరీంనగర్ జిల్లాలో ఈనెల 31 నుంచి యూరియా విక్రయాలు కేవలం ‘ఎరువుల బుకింగ్ యాప్’ ద్వారానే జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యాప్‌లో ముందే బుక్ చేసుకుని డీలర్ వద్ద కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టాదారు పాస్‌బుక్ మొబైల్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని, కౌలు రైతులు యజమాని ఓటీపీతో బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ గడువు మరుసటి రోజు అర్ధరాత్రి వరకే ఉంటుందని,రెండో విడతకు 15 రోజుల విరామం ఉంటుందన్నారు.

కరీంనగర్ సీపీ గౌష్ ఆలంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారి మతాన్ని ప్రస్తావిస్తూ, మత మార్పిడి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రెచ్చగొట్టే ధోరణితో చేసిన ఈ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

కరీంనగర్ జిల్లాలోని గిరిజన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) కె.సంగీత తెలిపారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ‘న్యూ స్కీమ్’ కింద, 9, 10వ తరగతి విద్యార్థులు ‘రాజీవ్ విద్యా దీవెన’ పథకం ద్వారా ఈపాస్ (e-pass) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను వెంటనే కార్యాలయంలో సమర్పించాలన్నారు.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు కోసం అధికార బలంతో పావులు కదుపుతుండగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామపంచాయతీ ఎన్నికల జోరును కొనసాగించేలా ‘కమల వ్యూహం’ అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన కేడర్‌ను కాపాడుకుంటూ గులాబీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల వేళ టికెట్ల వేటలో నేతలు పార్టీల గీతలు దాటుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరగడంతో ‘జంపింగ్ జిలానీల’ సందడి నెలకొంది. ఆయా పార్టీల్లో సీటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తూ సమీకరణాలను మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం దక్కుతుందన్న అంచనాతో, జెండాలు మారుస్తున్న నేతల తీరుతో నగర రాజకీయం వేడెక్కింది.

కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, ఆడిట్ పరిశీలకులుగా పెద్దపల్లి ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్ నియామకమయ్యారు. ఈమేరుకు వారు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.