India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన రైతు బొజ్జ సమ్మయ్య(53) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. మృతుడు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో రైతు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పొలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే సమ్మయ్య ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

భార్యాభర్తల మధ్య ఆర్థిక గొడవల కారణంగా జమ్మకుంటకు చెందిన భర్త సుద్దాల శ్రీనివాస్(39) మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ రామకృష్ణ గౌడ్ వివరాలిలా.. శ్రీనివాస్ భార్య మనమ్మ, భర్తకు తెలియకుండా తన సోదరికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి ఆ సొమ్ము అడిగినా రాకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

గత పదేళ్ల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందన్నారు. సీఎం నాయకత్వంలో విద్యా, వైద్యం, సాగునీటి రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్రులు, రెబల్స్ సవాల్‌గా మారారు. 66 డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మరోవైపు ఎంఐఎం 15 చోట్ల, జనసేన, బీఎస్పీలు గణనీయమైన స్థానాల్లో పోటీ చేస్తూ తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు భారీగా చీలిపోయి, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు గుమ్లాపూర్ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:50 వరకు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి రేపు చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను పరిశీలించి, భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

కొండగట్టు దేవాలయానికి మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. చొప్పదండిలో ఆయన మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువకు ఓటిలు, నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కృషి చేశారు. 30వార్డుల్లో అధికారులు ఆన్‌రిజర్వ్ -మహిళా 8, ఆన్‌రిజర్వ్- జనరల్ 7 కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ లో బీసీ-8, ఎస్సీ-3, OC-4 వార్డులకు B-ఫారం కేటాయించారు. ఈ నిర్ణయంతో బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని, బీసీల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కృషి చేశారు. 30 వార్డుల్లో అధికారులు ఆన్‌రిజర్వ్-మహిళా 8, ఆన్‌రిజర్వ్-జనరల్ 7 స్థానాలను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్‌లో BC-8, SC-5, OC-2 వార్డులు కేటాయించారు. ఈ నిర్ణయంతో బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని, BCల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.