India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాలేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలపై ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, దేవాదాయ శాఖ ఆర్జెసి, యాదగిరిగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్, ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈలు ఉండనున్నారు. పుష్కరాలకు రూ.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, పనులను ప్రారంభించారు.
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన 13 మంది అధికారులను పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. CPమాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. పోలీస్ అధికారులు రాజు, రాఘవేంద్రరావు ఉన్నారు.
అక్కన్నపేట మండల చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ (43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పులికాశి సంపత్ కబడ్డీ క్రీడాకారుడు కావడంతో తోటి క్రీడాకారులు, చౌటపల్లి గ్రామస్థులు కలిసి సంపత్‌కు చెందిన వ్యవసాయ బావి వద్ద భూమిని చదును చేసి కబడ్డీ ‘కోర్టు’ వేసి దానిపై ‘చితి’ ని పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ఈరోజు ప్రారంభించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఇందిరా భవన్ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీపై విధేయతకు చిహ్నంగా తన నివాస గృహానికి ఇందిరాభవన్‌గా నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భవనంలోనే సాదాసీదాగా నిత్యం తన వద్దకు వచ్చే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
కనుమను రైతులు పశువుల పండుగగా వ్యవహరిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన పశుపక్షాదులనూ ఈరోజు పూజిస్తారు. ఎద్దులను, ఆవులను, గేదెలను వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి, ఈత కొట్టిస్తారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది పూజిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల మండల ప్రజలు ఎడ్లబండ్ల రథాలతో కొత్తకొండకు వచ్చారు. వీరభద్రస్వామికి కోరమీసాలు, కోడెమొక్కులు, గుమ్మడికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శరభ శరభ స్లోగన్స్‌తో మారుమోగింది.
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.
గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రోడ్డుపై ఓ పక్క రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల రోడ్డుపై గుంత ఏర్పడి, క్రమక్రమంగా అది పెద్దగా అవుతుండటంతో గుర్తించేందుకు వీలుగా స్థానికులు దానికో గుడ్డ పీలిక చుట్టారు. ఇదంతా అధికారులు చూస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
KNR ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ మొదలైంది. జిల్లాలో మహిళలు, ఆడపడుచులు ఉదయాన్నే 4 గంటలకు లేచి వాకిట్లో ముగ్గులు, రంగవల్లులతో పోటీపడ్డారు. తదనంతరం స్నానాలు ఆచరించి గోబ్బేమ్మలు, ధాన్యలతో, రేగిపండ్లతో ముగ్గులను అలంకరించి చిన్నపిల్లలకు బడబుడకలతో దిష్టిని తీశారు. దీంతో ఉదయం ముగ్గులతో పండుగ మొదలుకొని సాయంత్రం వరకు కొత్త అల్లుళ్ల దావత్‌లు, తీపి వంటకాలతో పండుగను జరుపుకుంటారు.
Sorry, no posts matched your criteria.