India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఉమాదేవి తెలిపారు. క్రిమినల్, సివిల్ ఇతర కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్‌లో ప్రజలు కేసులను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఖమ్మం జిల్లాలో శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డే అమలు జరిగిందని ఇకపై ప్రతి నెలా 4వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై వివిధ సృజనాత్మక, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని, పిల్లలలో సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. శనివారం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మట్టి, పిండితో వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించే పద్ధతులను మానుకొని, మట్టి గణపతులకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

CPI రాష్ట్ర సమితి కార్యదర్శివర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా గాజులరామవరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. నేలకొండపల్లి మండలం మోటాపురంలో రైతు కుటుంబంలో జన్మించిన బాగం హేమంతరావు విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఖమ్మం నగరంలో శనివారం చిన్నారులు తమ చిట్టి చేతులతో ఎకో ఫ్రెండ్లీ గణనాధులను తయారు చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ గణపయ్యనే పూజించాలని తెలియజేస్తూ చిన్నారులు ఉత్సాహంగా ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేశారు. వివిధ రూపాలలో వినాయక ప్రతిమలను అందంగా రూపొందించారు. మట్టి గణపయ్యను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడమే నో బ్యాగ్ డే ముఖ్య ఉద్దేశ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నోబ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం ఇందిరనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. సమూహ కార్యకలాపాల్లో పాల్గొనడంతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నకిలీ సెస్ బిల్లులు కలకలం సృష్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్లో పత్తి వ్యాపారం చేసే ఒక ట్రేడర్, మరో వ్యాపారి సెస్ పుస్తకాలను దొంగిలించి, వాటిని నకిలీగా ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ దొంగ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించారు. బిల్లులు సరిపోలకపోవడంతో మార్కెట్లో విచారించగా, నకిలీ బిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులు విధుల బహిష్కరణకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ సిబ్బంది 463 మందికి 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో చేసేదేం లేక శనివారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు జేఏసీ నాయకుడు మద్దెల రవి ప్రకటించారు. దీంతో జిల్లాలు తాగునీటి సమస్య ఏర్పడనుందని పలువురు పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది జీతాలు చెల్లించి విధులు బహిష్కరణ విరమించేలా చూడాలని కోరుతున్నారు.

జిల్లాలో వచ్చే నెల 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలుకానుంది. దీంతో ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 748 రేషన్ షాపులు ఉండగా.. ఇప్పటి వరకు 150 దుకాణాల వరకు బియ్యం పంపించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 21,925 కొత్త కార్డులు మంజూరు చేయగా వీరికి వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 80 మందికి గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా పలువురు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక ఎస్జీటీలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాను ఈరోజు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.