India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బావులు, బోర్లను పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న 863 చేతి పంపులు, 20 మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది.

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసగించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఓపీడీఆర్ సభ్యులమని నమ్మిస్తూ నిందితులు బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు

ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రారంభించినట్లు DMHO డా. రామారావు తెలిపారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల్లో పేరుకుపోయిన చెత్త, పాత ఫర్నిచర్, కాలం చెల్లిన మందులను తొలగించాలని ఆదేశించారు. ప్రాంగణాలను ‘క్లీన్ & గ్రీన్’గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులు.. తమ అసలు బాధ్యతను విస్మరించి సైడ్ బిజినెస్‌లలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండో ఆదాయంపై మక్కువతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 317జీవో ప్రకారం ఇంటర్ లోకల్ కేడర్‌లో భాగంగా వీరిని మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఇతర జిల్లాలకు కేటాయించారు. నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాలకు చెందిన కార్యదర్శులు ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు. మార్చి 12న సర్పంచ్‌లు, కౌన్సిలర్‌లకు జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.

ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 16,663 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 14,801 మందికి గాను 14,526 మంది, అటు ఒకేషనల్ కోర్సుల్లో 2,276 మందికి గాను 2,137 మంది హాజరయ్యారని, మొత్తంగా 414 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అటు ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో ‘L3’ (అనర్హులు) జాబితాలో ఉన్నవారిని కమిటీ సభ్యులు ‘L1’గా గుర్తించి ఇళ్లు మంజూరు చేయడంతో సమస్య మొదలైంది. అధికారుల హామీతో అప్పులు చేసి బేస్‌మెంట్ పూర్తి చేసిన వందకు పైగా లబ్ధిదారులకు, నిబంధనల సాకుతో బిల్లులు అందడం లేదు. అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నామని, తనిఖీలు చేసి నిధులు విడుదల చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఐఎస్‌ఐ మార్క్, ల్యాబ్ సౌకర్యం లేకుండానే బోరు నీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఒక లీటర్ నీటి కోసం మరో లీటర్ వృధా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాణ్యత లేని నీటితో రోగాల బారిన పడుతున్నామని, అధికారులు కల్తీ నీటి ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.