Khammam

News March 8, 2026

ఖమ్మం: భారీగా యూరియా రాక

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శనివారం 2,670.84 మెట్రిక్ టన్నుల ఇఫ్కో యూరియా చేరుకుంది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,070.84 టన్నులు, భద్రాద్రికి 500, మహబూబాబాద్‌కు 900, ఖమ్మం సీఆర్పీకి 200 టన్నుల యూరియా కేటాయించినట్లు టెక్నికల్ ఏవో పవన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 8, 2026

వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

image

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.

News March 7, 2026

విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

image

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News March 7, 2026

ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

image

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.

News March 7, 2026

అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

News March 6, 2026

అంధుల పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాల పనులను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. భవన నాణ్యత, తరగతి గదులు, టాయిలెట్స్, ప్రవేశ మార్గాలు, భద్రతా సదుపాయాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంధ విద్యార్థులకు బ్రెయిల్ లిటరసీ డివైస్, ఆడియో పాఠాల సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News March 6, 2026

వీధి కుక్కల బెడదకు ప్రత్యేక కార్యక్రమాలు: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయి, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అటు ప్రధాన సమస్య అయిన వీధి కుక్కల బెడద తొలగించేందుకు MAR 14న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

News March 6, 2026

ఖమ్మం జిల్లాలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ షెడ్యూల్

image

☆ MAR 6 నుంచి MAR 15 వరకు పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లీయరెన్స్
☆ APR 6 నుంచి APL 11 వరకు వైద్య శాఖ
☆ APR13- 18 వరకు రోడ్ సేఫ్టీ
☆ APR 20-26 వరకు SC, ST, BC, మైనారిటీ సంక్షేమం, హౌసింగ్
☆ APR 27 నుంచి MAY 2 వరకు చైల్డ్ సేఫ్టీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు
☆ మే 4-10 వరకు అగ్రికల్చర్
☆ మే 11-16 వరకు విద్య
☆ మే 18-23 వరకు క్రీడలు
☆ మే 25-30 వరకు మహిళా సంక్షేమం
☆ జూన్ 1-12 వరకు పర్యావరణం

News March 6, 2026

99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి: వాకిటి

image

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని ఉమ్మడి ఖమ్మం ఇన్‌ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆర్థికస్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషిచేయాలని శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలని పేర్కొన్నారు.

News March 6, 2026

పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

image

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.