Khammam

News August 21, 2024

KU: కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ముస్తాఫా, అదనపు పరీక్షల నియంత్రణాధికారి నాగరాజు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27, 29, 31 సెప్టెంబర్ 2, 4, 6న పరీక్షలు మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు జరుగుతాయన్నారు.

News August 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

>త్వరలో ‘ధరణి’ సమస్యలకు చరమగీతం: మంత్రి పొంగులేటి
>చండ్రుగొండ: ‘అప్పు చేసి డబ్బు కట్టాను.. మాఫీ చేయండి’
>భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
>గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి
>ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం
>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

News August 20, 2024

భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం: కలెక్టర్

image

ఖమ్మం: భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే దంసలాపురం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి, సాధ్యమైనంత వరకు అన్ని విధాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

News August 20, 2024

ఖమ్మం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 

image

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

News August 20, 2024

చండ్రుగొండ: ‘అప్పు చేసి డబ్బు కట్టాను.. మాఫీ చేయండి’

image

రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని చండ్రుగొండ మండలం మంగయ్య బంజరకు చెందిన రైతు మాలోతు లింగ్యా అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో జరిగిన రైతు నేస్తంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలే రైతుబంధు రాక అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టానని, మాఫీ అవుతుందన్న ఆశతో రూ.2 లక్షలపై మొత్తాన్ని అప్పు చేసి కట్టానని వాపోయారు.

News August 20, 2024

ఖమ్మం: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

image

నూతన కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రెవిన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ సీట్ సెక్రటరీ శాంతి కుమారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి కూడా పాల్గొన్నారు.

News August 20, 2024

దమ్మపేట: భారీగా గంజాయి పట్టివేత

image

దమ్మపేట మండలంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యానులో తరలిస్తున్న 5 క్వింటాళ్ల భారీ గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయిని పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 20, 2024

KMM: ‘ఐటీ రంగానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ’

image

భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకొని కుసుమంచిలో రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. తదనంతరం మాజీ ప్రధాని ఉద్దేశించి మంత్రి, ఎంపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News August 20, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ప్రసవం

image

కొత్తగూడెంకు చెందిన న్యాయమూర్తి స్వప్న ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. సన్యాసిబస్తీ న్యాయవాది కార్తీక్‌, స్వప్న దంపతులు. ఆరేళ్లుగా నిడమనూరు జూ.సివిల్ జడ్జిగా ఆమె పనిచేస్తున్నారు. మొదటి కాన్పు కోసం పుట్టింటికి రాగా, రామవరంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్యకేంద్రంలో ఆడశిశువుకు జన్మనిచ్చారు. సామాన్య ప్రజలకు నమ్మకం వచ్చేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన స్వప్నను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

News August 20, 2024

ములకలపల్లి: టాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మలకలపల్లి మండలంలో నిన్న రాత్రి 11గం.కు చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామానికి ప్రసాద్ చెందిన నాగమణిలు దంతలబోరు వైపు నుంచి ములకలపల్లి వైపు ట్రాక్టర్ పై వస్తుండగా కొత్తూరు శివారులోని కోళ్లఫారం వద్ద అదుపుతప్పి పల్టీకొట్టింది. ట్రాక్టర్ ఇంజను వారిపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.