India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు.. కొత్త ప్లాట్ ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు వంటి అంశాలపై వివరించారు.
వైరా, నేలకొండపల్లి మండలాల్లో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి వైరా (M) పుణ్యాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం నేలకొండపల్లి (M) మేడేపల్లి, అనసాగరం, సదాశివాపురం, నాచేపల్లి, చెర్వుమాదారం, అమ్మగూడెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.
సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
∆} ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.
✓ సింగరేణి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ✓ఖమ్మం: సేంద్రీయ సాగుపై మంత్రి తుమ్మల సంతృప్తి ✓ వనంవారి కిష్టాపురం వద్ద కారు బోల్తా.. స్వల్ప గాయాలు ✓ కూసుమంచి: సోదరుల మధ్య ఘర్షణ.. అన్న తలకు గాయం ✓ మన ఖమ్మం జిల్లాకు రూ.1,400 కోట్లు ✓ చింతకాని : యువతి అదృశ్యం.. కేసు నమోదు ✓ చింతకాని: లింగనిర్ధారణ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.
పుట్టకోటలోని శ్రీ చైతన్య గ్లోబల్ క్యాంపస్ నందు ‘ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ -బియాండ్ బౌండరీస్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్రాంత సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరై AI, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల గురించి వివరించారు. సదస్సులో 2 వేలకు పైగా ప్రముఖులు, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లంపాటి శ్రీధర్, ఏజీఎంలు, కోఆర్డినేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్న లెక్చరర్ కె.హరిశంకర్‌పై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయనను IEJD విధుల నుంచి తొలగించారు.
వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్‌కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.
Sorry, no posts matched your criteria.