India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 22.150 కేజీల గంజాయితో పట్టుబడిన రాజస్థాన్‌కు చెందిన భాగ్ చంద్ బైర్వా (A1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన మునగల వీరభద్రం(55) స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలని, నిర్మాణ దశలో ఉన్న రహదారులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాజ్యసభ ఎంపి వద్దిరాజు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీకి సమస్యలను పరిష్కారిస్తామని హామినిచ్చారు.

ఖమ్మం జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్, DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పనిచేయాలన్నారు.

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. రోశయ్య ఆర్థిక, విద్య, వైద్య, రవాణా తదితర శాఖల్లో సేవలందించడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు-కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన మహనీయుడని కలెక్టర్ అన్నారు.

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు
Sorry, no posts matched your criteria.