Khammam

News April 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.800 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News April 3, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై వీడని పీటముడి

image

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయం తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్‌ ఇవ్వాలని కొందరు, వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో వారం రోజులు సమయం పట్టొచ్చని తెలుస్తొంది.

News April 3, 2024

ఖమ్మం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎస్‌ఐ సాయికుమార్‌ కథనం ప్రకారం ముస్తఫానగర్‌కు చెందిన యల్లబోయిన ఉపేందర్‌(33) భార్య నీలిమతో గొడవపడగా ఆమె సోమవారం రాత్రి సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఉపేందర్‌ పురుగుల మందు తాగాడు. మంగళవారం నీలిమ ఇంటికి రాగా, ఉపేందర్‌ అపస్మారక స్థితిలో ఉండడంతో ఇంటిపక్కవారిని పిలిచి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News April 3, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం
∆} పదో తరగతి పేపర్ల మూల్యకలనం
∆} కూసుమంచి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News April 3, 2024

ఈనెల 6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే..?

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీతో తెల్లం వెంకట్రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ బహిరంగ సభ శనివారం జరగనుంది. ఈ సభలోనే తెల్లం వెంకట్రావు తన అనుచరులతో పాటు హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.

News April 3, 2024

ముందస్తు పన్ను చెల్లిస్తే రాయితీ…30 వరకు అవకాశం

image

ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే సాధ్యమైనంత మేర ఆస్తిపన్ను రాబట్టేలా అధికారులు ఏటా మాదిరిగా ఎర్లీ బర్డ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ లభించనుంది. అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదటి రోజు నుండే పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఎర్లీ బర్డ్ ద్వారా ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు.

News April 2, 2024

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి: ప్రియాంక అలా

image

భద్రాద్రి కొత్తగూడెం ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా రక్షణ చర్యలు పాటించాలని ప్రజలకు కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్ని మండలాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు.

News April 2, 2024

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి తుమ్మల

image

ఖమ్మం నగరంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇఫ్తార్‌ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.

News April 2, 2024

మిర్చి ధరల తిరోగమనం.. రూ.2 వేలు తగ్గుదల

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. మార్కెట్లో మంగళవారం క్వింటా మిర్చిని రూ.19,500 జెండాపాట నిర్ణయించగా వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ.11,000 నుంచి రూ.15,000 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మార్చిలో క్వింటా రూ.21,500 పలికిన మిర్చి ధర ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెల రోజుల క్రితం ధరతో పోలిస్తే క్వింటాకు సుమారు రూ.2,000 తగ్గింది.

News April 2, 2024

ఖమ్మం: లారీ, ట్రాక్టర్ ఢీ.. కూలీ మృతి

image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కూలీ జుజ్జునూరి మాధవరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. వరి గడ్డి లోడుతో నాచారం నుంచి దిద్దుపూడి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మాధవరావు దిద్దుపూడి గ్రామానికి చెందిన కూలీగా గుర్తించారు.