Khammam

News August 16, 2024

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 20లోగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. 2022-23,2023-24లో వివిధ అంశాలతో నిర్ణీత నమూనాలు నేరుగా డీఈవో కార్యాలయానికి అందించాలని, దరఖాస్తుదారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేవని, కోర్టు కేసులు పెండింగ్లో లేవని ధ్రువీకరణ పత్రాలు అందించాలని తెలిపారు.

News August 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
>గార్ల: వాగులో కొట్టుకుపోతున్న వారిని కాపాడిన ఆటో డ్రైవర్
>ముదిగొండ పోలీస్ స్టేషన్ ను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు
>రైతుల నమ్మకాన్ని వమ్ము చెయ్యం: మంత్రి తుమ్మల
>ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొంగులేటి
>ఛాలెంజ్ చేసి మరీ రుణమాఫీ చేశాం: డిప్యూటీ సీఎం
>ముఖ్య మంత్రి మాటలు ఖండించిన: మాజీ MLA రేగా

News August 15, 2024

ఇన్ ఫార్మర్ నెపంతో విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు

image

చర్ల సరిహద్దు ప్రాంతం సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్‌ను మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్.. పోలీస్ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2024

ఖమ్మం: కాయిన్స్ తీసుకోకపోవడంతో గొడవ

image

నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురం
సమీపాన ఉన్న పెట్రోల్ బంక్‌లో బోదులబండకి చెందిన హరీశ్ అనే వాహనదారుడు రూ.163 పెట్రోల్ కొట్టమన్నాడు. బంకులో పనిచేసే వ్యక్తే హరీశ్ వద్ద ఉన్న చిల్లర కాయిన్లను చూసి ఫోన్ పే చేస్తేనే పెట్రోల్ కొడతానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బంక్ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించారని వాహనదారుడు సిబ్బంది, యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News August 15, 2024

ఖమ్మం: ముఖ్యమంత్రికి సీపీఎం బహిరంగ లేఖ

image

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను సీపీఎం జిల్లా సమితి స్వాగతిస్తుందని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. జిల్లా అభివృద్ధి కోసం పలు సమ స్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు వరకు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు.

News August 15, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నేడు మార్కెట్ అధికారులు సెలవు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని, రైతులు గమనించి తమకు సహకరించాలని కోరారు.

News August 14, 2024

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీఈవో

image

కామేపల్లి మండలం కొమ్మినేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సం దర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించ టం తో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెనూ అమలును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి పి.జ్యోతి, డీఈఓ ఆఫీస్ కు చెందిన సెక్టోరియల్ అధికారి రామకృష్ణ, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News August 14, 2024

బావిలో పడి మహిళ మృతి

image

వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన కామేపల్లి మండలం పండితాపురంలో బుధవారం జరిగింది. ఎస్సై బి.సాయి కుమార్ వివరాలిలా.. ధరంసోత్ నాగమణి (45) మధ్యాహ్నం తన పొలం వద్ద పనిచేస్తూ మంచి నీటి కోసం బావి దగ్గరకు వెళ్లింది. కాలు జారి బావిలో పడి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

News August 14, 2024

సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

image

ఖమ్మం జిల్లా వైరాలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సభ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News August 14, 2024

ఖమ్మంలో దారుణ ఘటన.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ

image

మనవడిని డబ్బుల కోసం నాయనమ్మ అమ్మేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. స్వప్న- సాయికి 2021లో వివాహమైంది. వీరికి యశ్వంత్ అనే 21 నెలల బాలుడున్నాడు. ఇటీవల సాయి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో స్వప్న అత్త నాగమణితో కలిసి ఉంటోంది. స్వప్నను వేరే వివాహం చేసుకోవాలని నమ్మించి యశ్వంత్‌ను నాగమణి వేరే వ్యక్తికి విక్రయించింది. విషయం తెలుసుకున్న స్వప్న 1-టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో బాలుడిని తీసుకున్నారు.