Khammam

News April 11, 2025

KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం

image

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన 9వ తరగతి విద్యార్థి వంశీ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండలంలో చౌడవరంనకు చెందిన వంశీ ఒంటిపూట బడులు కావడంతో ఆరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికెళ్తుండగా లారీఢీకొంది. ఈ ప్రమాదంలో కుడికాలు నుజ్జునుజ్జవగా హైదరాబాద్ తరలించగా వంశీ మృతిచెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 11, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు శనివారం, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా రైతులు గమనించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మార్కెట్ తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని చెప్పారు. 

News April 11, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించండి : తుమ్మల

image

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధి చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంట విలువ పెరుగుతుందన్నారు. భవిష్యత్ అంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానిదే అన్నారు. రైతులకు చేయూతనందించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని కోరారు.

News April 11, 2025

సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

image

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.

News April 11, 2025

ఖమ్మం జిల్లా అప్‌డేట్స్

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ∆} ముదిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో పవర్ కట్ ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 11, 2025

నియోజకవర్గ మార్పుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి

image

రాబోయే ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి కాకుండా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పేర్కొన్నారు.

News April 11, 2025

14 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ: మంత్రి

image

KMM: తిరుమలాయపాలెం మండలంలో 14 కోట్లతో గ్రామాల్లో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇస్లావత్ తండా, మెడిదేపల్లి, పిండిప్రోలు, తిరుమలయపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అటు రాబోయే 4 సం.లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు.

News April 11, 2025

టూ వీలర్ మెకానిక్‌ల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

ఖమ్మం టూవీలర్ మెకానిక్‌ల సమస్యలను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ స్వయంగా అడిగితెలుసుకున్నారు. మెకానిక్ షాపుల వద్దకు వెళ్లిన ఆయన వారితో మాట్లాడారు. వారి యూనియన్ ఆద్వర్యంలో చేస్తున్న అనేక కార్యక్రమాలను అధ్యక్షుడు కోండల్ రావు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వం పరంగా మెకానిక్‌లకు ఎలాంటి స్కీంలు లేవని వారు చెప్పారు. 

News April 10, 2025

ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు.!

image

☆ నియోజకవర్గ మార్పుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి☆ కార్మికులు ఉపాధితో పాటు కుటుంబ భద్రత పై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ ☆ ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు☆ ₹14 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ: మంత్రి పొంగులేటి☆ మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు☆ రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే

News April 10, 2025

KMM: కూలీ బిడ్డ.. ఏడాదిలో 5కొలువులు సాధించింది.!

image

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఖమ్మం(D) తల్లాడ(M) మిట్టపల్లికి చెందిన జంగం పౌలు-శారమ్మల కుమార్తె జ్యోతి శిరీష. ఒకే ఏడాది 5 ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. ఇటీవల గ్రూప్-1లో రాష్ట్రస్థాయి ర్యాంకు పొందింది. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు.. ఆర్థికంగా అంతంతే అయినా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వ కొలువుకు ఎంపికకావడంపై ఆమె తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.