India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 7 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. సదరం క్యాంపులకు దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 7, 12, 14, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన దివ్యాంగులు మెడికల్ రిపోర్టులు, పాస్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో హాజరు కావాలని సూచించారు.

☆ జిల్లాలో నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ మున్నేరు వరద తీవ్రతపై నేడు ఖమ్మం కమిషనర్ సమీక్ష
☆ జిల్లాలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు
☆ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న ఫీవర్ సర్వే
☆ బోనకల్‌లో నేడు రేషన్ కార్డుల పంపిణీ
☆ ఖమ్మం రూరల్: మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ జిల్లాలో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.

ఉత్సాహంతో పనిచేసే పోలీస్ సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కష్టపడి పనిచేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్కే. ఖాసీం అలీ, వి.గోపి, ఎం.సతీష్‌ను సీపీ అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం తప్పక ప్రోత్సాహం అందిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.

జిల్లాలో పెండింగ్ ఉన్న 1,132 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 260 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్దిదారులకు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. 217 ఇండ్ల పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్
సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల ప్రిన్సిపల్, హెచ్ఎం, వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్లూరు ఎస్టీ బాలికల హాస్టల్‌లో జరిగిన పరిణామాలు హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఐటీడీఏ పీవో మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రికి జర్నలిస్టులు పలు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి(D) గుండాల మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. వెన్నెలబైలుకు చెందిన పర్సిక రాజు (35) తన బైకుపై తన పొలం వద్దకు వెళ్తుండగా, బైక్‌కు హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. దీంతో బైకుకు మంటలు చెలరేగి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు బైక్‌పై వెళ్తున్న ఓ రైతు విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యాడు. వన్నెలబైలు గ్రామానికి చెందిన రాజు (35) తన పొలానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు అతడికి తగిలాయి. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌తో సహా రాజు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.

‘ముర్రు పాలు.. తల్లీబిడ్డకు శ్రీరామరక్ష’ అని వైద్యులు చెబుతున్నారు. శిశువుకు జన్మించిన వెంటనే లభించే ఈ తొలిపాలను ప్రకృతి ప్రసాదించిన మొదటి టీకాగా అభివర్ణిస్తారు. ముర్రుపాలలో పోషకాలు, యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.