India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.
గణేశ్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
ఖమ్మం మున్నేరు నది ఒడ్డున అసంపూర్తిగా నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనం సరిగా జరగలేదని విమర్శించారు. అధికారులు స్పందించి విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
2025-26 విద్యాసంవత్సరంలో నవంబరు 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఆన్ లైన్‌లో చెల్లించాలని సూచించారు.
సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి పరిశీలించారు. అనంతరం రోప్ వే నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.
ఖమ్మం నగరంలో శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.