Khammam

News August 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ ప్రజల ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్
☆ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
☆ భద్రాచలంలో 57.56 కేజీల గంజాయి పట్టివేత
☆ జల శక్తి అభియాన్ కార్యక్రమంపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమావేశం
☆ గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలి- తుమ్మల
☆ ఉమ్మడి జిల్లాలో ప్రొ. జయశంకర్ జయంతి కార్యక్రమం
☆ పాల్వంచలో దారిదోపిడి దొంగలు అరెస్ట్

News August 6, 2024

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం

image

కొత్తగూడెం: భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభయాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జల జీవన మిషన్ కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

News August 6, 2024

కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News August 6, 2024

మధిర: గల్లంతైన మృతదేహం లభ్యం

image

మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలోని వైరా నదిలో నిన్న అద్దంకి రవీంద్రా అనే యువకుడు ఈతకు వెళ్లి <<13783729>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. కాగా, ఈరోజు ఉదయం గాలింపు చర్యలను మొదలుపెట్టిన పోలీసు అధికారులు ఎట్టకేలకు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. రవీంద్ర మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 6, 2024

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

>భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం
>వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
>నేటి నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారుల పాలన
>పాల్వంచ పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

News August 6, 2024

ఇల్లెందు: ‘పాటమ్మ రాంబాబు’ పై కేసు నమోదు

image

ఇల్లెందు: ‘పాటమ్మ తోటి ప్రాణం’ పాట ఫేమ్ రాంబాబుపై కొమరారం పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై సోమేశ్వర్ వివరాల ప్రకారం.. మర్రిగూడెంకి చెందిన లతను, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సమీపంలోని అమ్మపురం గ్రామానికి చెందిన రాంబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా రాంబాబు, అతని తల్లిదండ్రులు లతను కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News August 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం
> ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షాలు
> నేడు పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
> నేడు వైరా రిజర్వాయిర్ నుంచి సాగు నీటి విడుదల

News August 6, 2024

ఖమ్మం కార్పొరేషన్ కు మంచి పేరును తీసుకురావాలి: మంత్రి

image

పారిశుధ్య నిర్వహణపై అందరూ సమిష్టిగా పనిచేసి ఖమ్మం కార్పొరేషన్ కు మంచి పేరును తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. పెరుగుతున్న నగర జనాభా దృష్టిలో ఉంచుకొని అవసరాలకు అనుగుణంగా పారిశుధ్య నిర్వహణకు నూతన ట్రాక్టర్ కొనుగోలుకు టెండర్లు ఆమోదించినట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ లో పొరపాట్లు జరగకూడదని అధికారులకు సూచించారు.

News August 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

∆} పాల్వంచలో KTPSలో పాత కూలింగ్ టవర్ల కూల్చివేత
∆}కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన
∆}ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
∆}రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందజేయాలి: మంత్రి
∆}భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన వివాహిత
∆}ప్రమాదవశాత్తు వైరా నదిలో మునిగి యువకుడు మృతి

News August 5, 2024

ఈనెల 15న జిల్లాలో సీఎం పర్యటన: మంత్రి తుమ్మల

image

ఈనెల 15న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి తుమ్మల సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.