India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని 116 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల జయాపజయాలు ఈనెల 13న కౌంటింగ్ అనంతరం తేలనుంది. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో 82.5% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లకు గానూ 1,17,043 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 24,832 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న 5 మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఏదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను సీపీ సందర్శించి, పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఖమ్మంలోని ఐదు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ బుధవారం కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని ఐదు ప్రత్యేక స్క్రీన్లపై పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా వెబ్ క్యాస్టింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని సీపీ సునీల్ దత్ బుధవారం పర్యటించి పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన.. భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలతో నిఘా ఉంచామన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కారణంగా ఈనెల 13న జిల్లాలో వాహన రవాణా శాఖ సేవలకు అంతరాయం కలగనుంది. వైరా కార్యాలయ సిబ్బంది శిక్షణకు హాజరవుతుండటంతో అక్కడ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి (DTO) ధర్మపురి జగదీష్ తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో సేవలు పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) సగటున 14.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కల్లూరులో 19.80%, కనిష్ఠంగా మధిరలో 12.72% పోలింగ్ జరిగింది. ఏదులాపురంలో 15.65%, వైరాలో 14.52%, సత్తుపల్లిలో 15.12% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పుర ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో నలుగురు ఆడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని సీపీ సూచించారు.

జిల్లాలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్‌ను ఖమ్మం కలెక్టరేట్‌లోని ప్రత్యేక సెల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 25 సమస్యాత్మక, 32అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను ఖమ్మం (634 టన్నులు), భద్రాద్రి కొత్తగూడెం (200), మహబూబాబాద్ (400) జిల్లాలకు కేటాయించారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

KMM జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో 116వార్డుల్లో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు 414మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,41,875 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో మహిళలు 74,083 మంది, పురుషులు 67,768 మందితో పాటు ఇతరులు 24 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రానికి కేటాయించిన కేంద్రాలకు చేరారు.
Sorry, no posts matched your criteria.