Khammam

News February 9, 2026

ఖమ్మం: రైతులకు ముఖ్య గమనిక.. FEB 20 చివరితేదీ

image

ప్రస్తుత పంట సం. 2025- 26లో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు ఈనెల 20ని చివరి తేదీగా సీసీఐ నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి రైతులలో ఇంకా ఎవరైనా సీసీఐకి మద్దతు ధరపై పత్తి అమ్ముకునేందుకు ఉంచినట్లయితే FEB 20లోగా తీసుకొని రావాలని సూచించారు. పత్తిని విక్రయించడానికి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News February 9, 2026

‘ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన జీవనం’

image

ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన జీవనం పొందవచ్చని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్థ్ మహిళా-స్వస్థ్ భారత్ ప్రోగ్రాంలో ఆయన అదనపు కలెక్టర్లతో పాల్గొన్నారు. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించి చికిత్స పొంది బతికినప్పటికీ లైఫ్ స్టైల్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మహిళా ఉద్యోగులకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.

News February 9, 2026

ఖమ్మం: ఏకంగా జిల్లా జైలుకే ‘కుళ్లిన మటన్ SUPPLY’

image

ఖమ్మం నగరంలోని మూడు బొమ్మల సెంటర్ వద్దగల ఓ మటన్ షాపుపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడి చేశారు. డీప్ ఫ్రిజ్లో నిల్వ ఉంచిన 30 కేజీల కుళ్లిపోయిన, దుర్వాసన వస్తున్న మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. కాగా, సదరు మటన్ యజమాని జిల్లా జైలుతో పాటు పలు హోటళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా ఉండటం గమనార్హం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News February 9, 2026

ఖమ్మం: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో ఇన్ని రోజులుగా సందడి చేసిన మైకులు, ప్రచార రథాలు మూగబోయాయి. 11న పోలింగ్ జరిగే వరకు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుంది. శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు వైన్ షాపులను మూసివేయించారు. ప్రచారంలో మూడు(కాంగ్రెస్, BRS, BJP) పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించాయి. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.

News February 9, 2026

ఖమ్మం: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన అర్జీలను ఎప్పటికప్పుడు శాఖల వారీగా పరిశీలిస్తూ, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

News February 9, 2026

ఖమ్మం: కాసేపట్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. బుధవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48గంటల ముందే మైకులు బంద్ కానున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ల ప్రచారం చివరిఅంకానికి చేరుకుంది. మరో అరగంటలో(5 గం.ల నుంచి) బహిరంగ సభలు, ప్రచార వాహనాలు తిరగడం నిషిద్ధం. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వైన్ షాపులూ పోలింగ్ ముగిసేవరకు మూతపడనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News February 9, 2026

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనకు ముమ్మర సర్వే

image

ఖమ్మం జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు వైద్యశాఖ రెండో విడత ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 13 వరకు ఆశా కార్యకర్తలు అనుమానితులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తారు. ఈ ఏడాది కొత్తగా 74 కేసులు నమోదయ్యాయి. శరీరముపై స్పర్శ లేని మచ్చలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు తెలిపారు

News February 9, 2026

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News February 9, 2026

పందిళ్లపల్లికి యూరియా రాక.. మూడు జిల్లాలకు కేటాయింపు

image

రైతులకు ఊరటనిస్తూ పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం యూరియా చేరుకుంది. క్రిబ్కో కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల ఎరువులు రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చినట్లు ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,246 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 500, మహబూబాబాద్‌కు 700 టన్నుల యూరియాను కేటాయించారు. మిగిలిన 200 టన్నులను అత్యవసర అవసరాల కోసం బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 9, 2026

ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.