Khammam

News February 6, 2026

ఖమ్మం: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‘రాయ’బారమేదీ?

image

ఏదులాపురం పుర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గైర్హాజరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పాలేరులో పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, వందలాది గ్రానైట్ పరిశ్రమలున్న ఈ మున్సిపాలిటీలో అంటీముట్టనట్లు ఉండటం వెనుక మంత్రి పొంగులేటి శిబిరం నుంచి పిలుపు అందకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు చర్చించుకుంటున్నారు.

News February 6, 2026

ఖమ్మం SC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం SCస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన 100మందికి ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, వార్షిక ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉన్న వారు ఈ నెల22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 6, 2026

రేపటితో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగింపు

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోరుకునే వారు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. అభ్యర్థులు ఫారమ్-12తో పాటు డ్యూటీ ఆర్డర్, ఎపిక్ కార్డు నకళ్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు 8న తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.

News February 6, 2026

రేపే నవోదయ ప్రవేశ పరీక్ష

image

పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9వ తరగతి ప్రవేశానికి 505 మంది, 11వ తరగతికి 797 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News February 5, 2026

ఖమ్మం జనరల్ ఆసుపత్రి వసతులపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పని తీరు, పెండింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుకు సీవరేజ్, టాయిలెట్ పనులు పూర్తి చేయాలని, 7 రోజుల్లో లిఫ్ట్ మరమ్మతులు చేయాలని సూచించారు. ఓపీ సేవల కోసం ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, మార్చి 15 నాటికి స్టఫ్ పనులు పూర్తి చేయాలన్నారు.

News February 5, 2026

ఖమ్మం RTO కార్యాలయంలో ‘నకిలీ’ దందాపై ఫోకస్

image

ఖమ్మం RTO ఆఫీస్‌లో వెలుగుచూసిన నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు RTO ధర్మపురి జగదీష్ వెల్లడించారు. ఇప్పటికే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు సిబ్బంది అండదండలతోనే ఈ అక్రమాలు సాగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.

News February 5, 2026

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

News February 5, 2026

నిధుల బకాయిల ఉచ్చులో ఖమ్మం పెద్దాసుపత్రి

image

ఖమ్మం పెద్దాసుపత్రికి ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆర్థో విభాగానికి రావాల్సిన రూ.60 లక్షల బకాయిల వల్ల మోకాళ్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

News February 5, 2026

ఖమ్మం RTA ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

image

KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలోని ఏజెంట్ షాపుల కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల దందా సాగుతోంది. కొంతమంది కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News February 4, 2026

ఫర్టిలైజర్ యాప్‌తో సజావుగా యూరియా పంపిణీ: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జనవరి 29 నుంచి నిన్నటి వరకు 25,252 మంది రైతులు యాప్ ద్వారా 1,08,721 యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, 87,350 సంచులు కొనుగోలు చేశారు. రైతులు పంట, విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సొసైటీల్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ద్వారా క్యూలైన్లు లేకుండా సమయం ఆదా అవుతోందన్నారు.