India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూనికలు, కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్‌కుమార్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు ఓ ఏజెంట్‌ను రూ.10 వేలు డిమాండ్ చేయగా, రూ.5వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ రమేశ్ బృందం కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి తక్షణమే శిక్షణ పూర్తి చేయాలని, కౌంటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో దుకాణాలు కోల్పోయిన వారి కోసం స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు తగిన తీసుకోవాలని సూచించారు.

నేలకొండపల్లి(M) ముటాపురం బిల్యాతండాలో ఒక రైతు తన ఉదారతతో మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మిరప కోతకు వచ్చిన కూలీలు పూల్‌సింగ్, ఆశాలు ప్రేమలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న రైతు భూక్యా మోహన్‌రావు.. వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో వీరన్న స్వామి సన్నిధిలో వివాహం జరిపించి, ఆశీర్వదించారు. కూలీల పట్ల రైతు చూపిన ప్రేమను స్థానికులు అభినందించారు.

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఉపాధి, భూ సమస్యలు, పెన్షన్లు, గృహాల కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించి పదవీ విరమణ చేసిన 7గురు అధికారులను కలెక్టర్ సన్మానించారు.

సత్తుపల్లి జవహర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గడ్డపలుగుతో హుండీని పగులగొట్టిన దొంగలు, అందులోని సుమారు రూ.20 వేల నోట్లను ఎత్తుకెళ్లారు. అయితే, బరువుగా ఉన్నాయనో ఏమో కానీ సుమారు రూ.5 వేల విలువైన నాణేలను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రంగంలోకి దిగారు. ఆయన మంత్రి పొంగులేటితో చర్చించి, ఒక వర్గానికి ఛైర్మన్, మరో వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ముఖ్య నేతలకు భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు పోలీసులకు శాపంగా మారింది. BRS నిరసనలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరగింది. సీఐపై దాడిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సునీల్ దత్ అరుగురిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ కొందరు అధికారులు సస్పెన్షన్లు, వీఆర్ఎస్‌లతో ఇబ్బందులు పడ్డారు. పార్టీల మధ్య నలిగిపోతూ విధులు నిర్వర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 28వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్‌ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్‌ఎస్-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.