Khammam

News August 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

∆} పాల్వంచలో KTPSలో పాత కూలింగ్ టవర్ల కూల్చివేత
∆}కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన
∆}ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
∆}రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందజేయాలి: మంత్రి
∆}భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన వివాహిత
∆}ప్రమాదవశాత్తు వైరా నదిలో మునిగి యువకుడు మృతి

News August 5, 2024

ఈనెల 15న జిల్లాలో సీఎం పర్యటన: మంత్రి తుమ్మల

image

ఈనెల 15న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి తుమ్మల సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 5, 2024

భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన వివాహిత

image

బూర్గంపాడు మండలం సారపాక మేడే కాలనీకి చెందిన భూక్యా శైలజ అనే వివాహిత సోమవారం భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సదరు మహిళ కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆర్థిక సమస్యలతోనే సదరు మహిళ గోదావరిలో దూకిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 5, 2024

ఈనెల 15న జిల్లాలో సీఎం పర్యటన: మంత్రి తుమ్మల

image

ఈనెల 15న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి తుమ్మల సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 5, 2024

శ్రమదానం చేసిన జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి స్థానిక 7వ వార్డు నందు పిచ్చి మొక్కలను తొలగించి జిల్లా కలెక్టర్ శ్రమదానం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను శుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News August 5, 2024

కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన

image

అశ్వాపురం మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 48 మంది విద్యార్థులకు ఏకైక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య బోధన అందడం లేదని అన్నారు. కావున మండల అధికారులు స్పందించి, పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

News August 5, 2024

ఖమ్మం: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ దగ్ధమైన ఘటన ముదిగొండ మండలం సువర్ణపురంలో ఆదివారం జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేల్పుల వెంకటరామారావు తన ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు వచ్చాయి. క్షణాల్లో దగ్ధమైంది. 

News August 5, 2024

దోస్ట్ రిజిస్ట్రేషన్లకు ఇవాళే లాస్ట్: ప్రిన్సిపల్ మహ్మద్ జాకీరుల్లా

image

డిగ్రీలో చేరేందుకు ‘దోస్త్’ ప్రత్యేక విడతకు నేడు తుది గడువని ఖమ్మం ఎస్ఆర్&బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 7న సీట్లు కేటాయిస్తారని.. 9 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని చెప్పారు. 

News August 5, 2024

రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు: మంత్రి

image

ఖమ్మం: రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు సూచించారు. ఆదివారం పోలీస్ కమిషనర్‌తో మంత్రి సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతున్నారని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

News August 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

✓ ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
✓కార్పొరేషన్ చైర్మన్‌లతో మంత్రి తుమ్మల సమీక్ష
✓నా చివరి శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే
✓మణుగూరులో రెండున్నర కిలోల గంజాయి పట్టివేత
✓రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు: మంత్రి పొంగులేటి