Khammam

News July 26, 2024

మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తాం: డిప్యూటీ సీఎం

image

2024-25లో మైనార్టీ విద్యార్థులకు UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అటు ఈ ఏడాది రంజాన్ పండుగ వేడుకలకు రూ.33కోట్లు రిలీజ్ చేశామన్నారు.

News July 26, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. ఈనెల 30న మంగళవారం రోజున
మార్కెట్ పునఃప్రారంభం అవుతుందన్నారు.

News July 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల సంబరాలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

News July 26, 2024

సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల

image

ఖమ్మం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికి, రాష్ట్ర బడ్జెట్‌లో ₹72,659 వేల కోట్లు వ్యవసాయరంగానికి కేటాయించడం హర్షనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి రాష్ట్ర రైతాంగం తరపున మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రుజువైందన్నారు.

News July 25, 2024

HYD రైల్వే స్టేషన్‌లో భద్రాద్రి జిల్లా వాసి మృతి

image

మౌలాలి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం..భద్రాది జిల్లా పాల్వంచ వాసి షేక్ మహ్మద్ HYDలో ఉంటూ.. ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా సొంతూరికి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు బదులు చెన్నై ట్రైన్ ఎక్కాడు. పొరపాటు తెలుసుకొని మౌలాలిలో రైల్‌ నుంచి దిగబోయాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో‌ మృతి చెందాడు.

News July 25, 2024

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది అధికారులు, ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ మాలతి పాల్గొన్నారు.

News July 25, 2024

ఖమ్మం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటల సాగు

image

ఖమ్మం జిల్లాలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఆశించిన మేర పంటల సాగు జరగలేదు. ఈ సీజన్ ఆరంభంలోనూ ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ జూలై ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్లోనైనా సాగు సమృద్ధిగా జరగాలనే ఉద్దేశంతో రైతులందరూ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే జిల్లాలో రికార్డు స్థాయిలో 3లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

News July 25, 2024

వైరా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

image

వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అటు పలువురు జిల్లా నేతలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News July 25, 2024

రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. గురువారం ఉదయం 6 గంటలకు 46.1 అడుగు ఉన్న గోదావరి 9 గంటలకు 47.1 అడుగుకు చేరింది. ఉదయం 11 గంటలకు 47.5 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువ కానుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహకంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

News July 25, 2024

సింగరేణి ఓసీలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 3 నందు డంపర్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నరేష్ (41) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని సింగరేణి మార్చరీకి తరలించారు. విషయం తెలుసుకున్న టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి సందర్శించి మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.