Khammam

News January 29, 2026

ఖమ్మం ఇన్‌ఛార్జ్ డీఆర్‌డీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్

image

ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్ డీఆర్‌డీఓగా జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తన శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.

News January 29, 2026

డిగ్రీ పాత విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 2016 కంటే ముందు వార్షిక విధానంలో డిగ్రీ చదివి, సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ బాణోతు రెడ్డి తెలిపారు. అభ్యర్థులు వర్సిటీ పరీక్షల విభాగం నుంచి ముందస్తు అనుమతి పొంది దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 29, 2026

ఖమ్మం: ఏసీబీ రిపోర్ట్ రెడీ.. 2,3రోజుల్లో ఉత్తర్వులు..!

image

జిల్లా RTOలో చోటుచేసుకున్న అవినీతిపై ACBఅధికారులు రిపోర్ట్ సిద్ధం చేశారు. కార్యాలయంలో తిష్టవేసిన అధికారులు, సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో సాగిస్తున్న ‘నిలువు దోపిడీ’పై పక్కా ఆధారాలను సేకరించారు. ఇటీవల నిర్వహించిన దాడుల్లో బయటపడిన అక్రమాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 2,3రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

News January 29, 2026

ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లే!

image

ఖమ్మంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లిలో 3, వైరాలో 2, ఎదులాపురంలో 2 నామినేషన్ల సమర్పించగా.. మధిర, కల్లూరుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.

News January 28, 2026

బోధనలో సాంకేతికతను జోడించాలి: డీఈఓ చైతన్య జైనీ

image

నిత్య బోధనా ప్రక్రియలో సమాచార భావ ప్రసార సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని డీఈఓ చైతన్య జైని ఉపాధ్యాయులకు సూచించారు. ఖమ్మంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2రోజుల ఐసీటీ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గూగుల్ ఫార్మ్స్, షీట్లు, స్లైడ్ల వంటి డిజిటల్ సాధనాలను బోధనలో భాగం చేయడం ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని తెలిపారు.

News January 28, 2026

ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలు: సీపీ

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుంచి అమల్లోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా సాగించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పెంచామన్నారు.