India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైరా మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు పొంగులేటి, భట్టి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతమైంది. ఇక్కడ 20 డివిజన్లు ఉండగా 190 మంది నామినేషన్లు వేశారు. ఇందులో టికెట్ ఆశించిన ఇద్దరు మంత్రుల అనుచరులు ఏమాత్రం తగ్గేదే లే అంటూ మెజార్టీ డివిజన్లలో నామినేషన్లు వేశారు. తమ నేత ఆశీస్సులతో తమకే బి ఫారం వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇద్దరు మంత్రుల్లో ఎవరిది పై చేయి అవుతుందో నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు ఆగాల్సిందే.

జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 117వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో శుక్రవారం వరకు 923 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం (32)లో 241, సత్తుపల్లి (23)లో 154 దాఖలయ్యాయి. వైరా (20) 190, మధిర (22) 178, కల్లూరు (20) 159నామినేషన్లను 779 మంది అభ్యర్ధులు వేశారు. 60 మంది ఇండిపెండెంట్లు కాగా కాంగ్రెస్ 374, BRS 251, BJP 110, ఇతరులు 61, CPM 47, TDP 13, BSP, YCPకి 1 చొప్పున నామినేషన్లు వేశారు.

ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఐదో జాతీయ సీనియర్ మహిళా టీ20 క్రికెట్ టోర్నీని శుక్రవారం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రారంభించారు. క్రికెట్ టోర్నీకి తరలివచ్చిన వివిధ రాష్ట్ర క్రికెటర్లకు పౌష్టికారంతో కూడిన కొన్ని స్నాక్స్, కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడరంగ అభివృద్ధికి ఎంతోకృషి చేస్తుందన్నారు.

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 11న 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్ట్రాంగ్ రూములను బ్యాలెట్ బాక్స్‌లను స్టేట్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిన్నటివరకు 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం 87, వైరా 62, సత్తుపల్లి 62, కల్లూరు 76, మధిరలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలవారీగా మొత్తం 309 మందికి గానూ BJP 35, CPM 23, కాంగ్రెస్ 114, BRS 124, TDP 2, గుర్తింపున్న పార్టీలు 8, 10 మంది ఇండిపెండంట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నేడు నామినేషన్లకు అఖరిరోజు కావడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశముంది.

100% పిల్లల పఠన సామర్థ్యాలు పెంచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి విద్యాశాఖ అధికారులతో ఎవ్రీ ఛైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై సమీక్షించారు. 100% ఇంగ్లీష్ పఠన సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు కీలక ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతీది సరిగ్గా ఉన్నాయో లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.