Khammam

News January 27, 2026

ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు..!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ గడువు ఏప్రిల్ వరకు ఉన్నందున, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కేవలం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్, 13 ఫలితాలు వెల్లడవుతాయి.

News January 27, 2026

ఖమ్మం: ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్ ఓపెన్

image

ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు RCO అరుణకుమారి తెలిపారు. CBSE సిలబస్‌‌లో బోధన ఉంటుందన్నారు. భద్రాద్రిలోని ములకలపల్లి, గండుగులపల్లి, గుండాల, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, టేకులపల్లితో ఖమ్మంలోని సింగరేణి పాఠశాలలో 480 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవాలని, మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News January 27, 2026

ఖమ్మం డీఈవో ‘చైతన్య పథం’.. తప్పు చేస్తే ‘డిస్మిస్’..!

image

ఖమ్మం DEOగా విధుల్లో చేరిన చైతన్య జైని విద్యాశాఖ ప్రక్షాళన దిశగా తీసుకుంటున్న చర్యలు ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నర్సింహులగూడెం టీచర్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయగా.. విధి నిర్వహణలో రీల్స్ చేస్తూ, ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేస్తున్న మరో టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒత్తిళ్లకు లొంగకుండా, విద్యాశాఖను సరిదిద్దుతున్న DEOను పలువురు అభినందిస్తున్నారు.

News January 26, 2026

వైద్య సేవలకు గుర్తింపు.. డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌ గౌడ్‌కు పురస్కారం

image

ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖలో విశేష సేవలు అందించిన డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కేసగని రాజశేఖర్‌ గౌడ్‌ను ఉత్తమ జిల్లా స్థాయి అధికారి పురస్కారం వరించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చూపిన నిబద్ధతను అధికారులు కొనియాడారు. పురస్కారం పట్ల పలువురు వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

News January 26, 2026

ఖమ్మం: జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు: కలెక్టర్ అనుదీప్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కలెక్టర్ అనుదీప్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశమిచ్చారు. సన్నవడ్లు పండించిన 39,475 రైతులకు రూ.113.57 కోట్లు బోనస్ జమ, 9.30 లక్షల గ్యాస్ సిలిండర్లకు రూ.26.31 కోట్లు సబ్సిడీ, 2,46,855 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు చేరవేశామని వెల్లడించారు.

News January 25, 2026

ఖమ్మం: రేపు జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్

image

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొంటారని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ. 9:30కు కలెక్టర్ ప్రసంగం. 9:50కు సాంస్కృతిక కార్యక్రమాలు. 10:45కు ప్రశంస పత్రాల పంపిణీ అనంతరం కలెక్టర్ స్టాళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు.

News January 25, 2026

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: శ్యామల

image

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసులకు కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె. శ్యామల భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన ఆమె, ఇటీవల పార్టీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేసులు నమోదైన కార్యకర్తలను స్వయంగా పరామర్శించారు. అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం నేరమా? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

News January 25, 2026

ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్‌’

image

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

News January 25, 2026

రేపటి నుంచే ‘వాహన్’ సేవలు.. శిక్షణపై డీలర్ల అసంతృప్తి!

image

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై ‘వాహన్’ పోర్టల్ ద్వారా సాగనుంది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి పరిధిలోని 72 షోరూంలలో సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వెబ్‌సైట్ నిర్వహణపై అధికారుల నుంచి కనీస అవగాహన, శిక్షణ లేకపోవడంతో షోరూం యజమానులు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వినియోగదారులు ఇబ్బంది పడతారని వాపోతున్నారు. అధికారులు శిక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

News January 25, 2026

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్‌ఛార్జిలు వీరే..!

image

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.