Khammam

News July 24, 2024

బొగత జలపాతానికి పోటెత్తిన వరద

image

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గల బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో సందర్శకులను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గేవరకు నీటిలోకి ఎవరు దిగవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవేశించడంతో అటవి శాఖ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

News July 24, 2024

కమనీయం రాములోరి నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News July 24, 2024

సింగరేణి కాంటాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమాను HDFC బ్యాంకు ద్వారా వర్తింపజేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. HDFC బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి ఇది అమలు అవుతుందన్నారు. ఆగస్టు నెల నుంచి కాంట్రాక్ట్ కార్మికులందరికీ దీనిని వర్తింపజేస్తామని వారు పేర్కొన్నారు.

News July 24, 2024

బొగత జలపాతం సందర్శన బంద్

image

బొగత జలపాతం సందర్శన నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ రేంజర్ చంద్రమౌళి తెలిపారు. వర్షాల కారణంగా జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందన్నారు. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా సందర్శన నిలిపివేస్తున్నామన్నారు. ప్రవాహం తగ్గిన అనంతరం తిరిగి సందర్శన ప్రారంభిస్తామన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సందర్శనకు రావొద్దని కోరారు. కాగా జలపాతంలో నిన్న ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

News July 24, 2024

గుండాల: పురుగు మందు తాగి విద్యార్థి బలవన్మరణం

image

పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఓ విద్యార్థి(12) బలవన్మరణం చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుండాల గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. పాఠశాలకు వెళ్లాలని చెప్పడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. ఇల్లెందులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

News July 24, 2024

ఖమ్మం: నేటి నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఉన్న ఏడు డిపోలలో ప్రమాదాలను నివారించేందుకు వారం రోజులు పాటు ప్రమాదం రహిత వారోత్సవాలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. డ్రైవర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమాద రహితంగా విధులు నిర్వహించిన డ్రైవర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

News July 24, 2024

చింతకాని: ప్రియురాలి మృతి.. యువకుడు సూసైడ్

image

ప్రియురాలు మృతి చెందటంతో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని వందనం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్(24) గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రెండు వారాల క్రితం యువతి అనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురై యువకుడు ఉరేసుకున్నాడు. ఎస్సై నాగుల మీరా కేసు నమోదు చేశారు.

News July 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల వర్షాలు
> క్రమేపీ తగ్గుముఖం పడుతున్న గోదావరి నది ప్రవాహం
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు నుండి కలగనున్న ఉపశమనం
> నేడు భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

News July 24, 2024

వెంకటాపురం: రామప్పను సందర్శించిన పురావస్తుశాఖ డీఈ

image

రామప్ప ఆలయానికి హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల వెయ్యి ఏళ్ల వరకు డోకాలేదని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. వర్షాల వల్ల రామప్ప ఆలయం కురుస్తుందని వచ్చిన వార్త కథనాలను కేంద్ర పురావస్తు శాఖ డీఈ ఖండించారు. రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు లేదని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో అధికారులు చంద్రకాంత్, కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

News July 23, 2024

ఖమ్మం: బొగత జలపాతంలో యువకుడి మృతి

image

వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు జశ్వంత్(19) కొలనులో గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి మృతదేహాన్నీ సాయంత్రం వెలికి తీశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.