Khammam

News July 22, 2024

ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. బేడా మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 22, 2024

ప్రియాంక గాంధీని కలిసిన డిప్యూటీ సీఎం

image

మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం AICC అగ్రనేత ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ప్రియాంక గాంధీని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలను ప్రియాంక గాంధీకి వారు వివరించారు.

News July 22, 2024

పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి పొంగులేటి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షాలకు ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పాల్గొన్నారు.

News July 22, 2024

భద్రాచలం: గోదావరి వద్ద సెల్ఫీ దిగితే.. పోలీస్ స్టేషన్‌కే

image

గోదావరిలో వదర ఉధృతి భద్రాచలంలో జిల్లా రెవెన్యూ అధికారుల పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉందన్నారు. కాగా, గోదావరి బ్రిడ్జి పై సెసెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని అధికారులు నిబంధన పెట్టారు. నిబంధన ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.

News July 22, 2024

భద్రాచలం: నమోదైన టాప్-5 నీటిమట్టం వివరాలు

image

భద్రాచలం వద్ద గతంలో నమోదైన టాప్-5 గోదావరి నీటిమట్టం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1) 1986 ఆగస్టు 16న 75.6 అడుగులు, 2) 2022 జులై 16న 71.3 అడుగులు, 3) 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 4) 2006 ఆగష్టు 6న 66.9 అడుగులు, 5) 1976 జూన్ 22న 63.9 అడుగులుగా గోదావరి నీటిమట్టం నమోదైంది. కాగా ప్రస్తుతం గోదావరి వద్ద 47.3 అడుగులుగా నీటిమట్టం కొనసాగుతోంది.

News July 22, 2024

నేలకొండపల్లి: నాన్నకు ప్రేమతో విగ్రహం చేయించిన కుమారులు

image

తండ్రి కన్నుమూసినా ఎప్పటికీ తమ కళ్ల ముందే ఉండాలని ఆయన కుమారులు తండ్రి విగ్రహాన్ని చేయించారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుండపనేని పరాంకుశ రావు ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన కుమారులు రాంచందర్ రావు, లక్ష్మణరావు ఎప్పటికీ తమ కళ్ల ముందే తండ్రి రూపం ఉండాలనే భావనతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రూ.80 వేలతో ఆయన విగ్రహం చేయించి తమ పొలంలో మందిరం నిర్మించారు.

News July 22, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,300 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News July 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం జిల్లాలో నేడు పలు చోట్ల వర్షాలు
> రెండో ప్రమాద హెచ్చరిక దిశగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
> లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
> నేడు పెద్దవాగును పరిశీలించనున్న మంత్రి పొంగులేటి
> భద్రాచలం రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> పలు మండలాల్లో రుణమాఫీ సంబరాలు

News July 22, 2024

ఖమ్మం: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. NTR జిల్లా వాసి వెంకటరత్నం(50) కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన హైమవతి(45) కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. ముదిగొండ మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముత్తారానికి చెందిన సింహాద్రి(20) బైక్‌పై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వారి కిష్టాపురం శివారులో డోజర్ ఢీకొంది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News July 22, 2024

పాలేరుకు చేరిన నాగార్జున సాగర్ జలాలు

image

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా శనివారం నీరు విడుదల చేయగా ఆదివారం సాయంత్రం పాలేరు రిజర్వాయర్‌కు చేరాయి. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అది క్రమంగా 3వేల క్యూసెక్కులకు చేరనుంది. రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనుండగా.. నాలుగు రోజుల పాటు నీటి సరఫరా కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారానికి 5.55 అడుగులకు పడిపోగా సాగర్ జలాల చేరికతో క్రమంగా పెరుగుతోంది.