Khammam

News July 21, 2024

అలా జరిగితే ఉప ఎన్నికలు: మంత్రి తుమ్మల

image

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. వారు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తిస్తే మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News July 21, 2024

ఖమ్మం: ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News July 20, 2024

ఖమ్మం, మధిర డిపోల సిబ్బందితో ముచ్చటించిన మంత్రి

image

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. డిపోలలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి మరియు డిపోలో ఉన్న ఇబ్బందుల గురించి ఖమ్మం మరియు మధిర డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

News July 20, 2024

భద్రాచలం: ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

2024-25 విద్యా సం.కు గాను ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలో ప్రవేశాల కొరకు, 2వ విడత ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, ప్రభుత్వ ఆశ్రమ పారిశ్రామిక శిక్షణ సంస్థ, కృష్ణసాగర్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. అభ్యర్థులు iti.telangana.gov.in అనే వెబ్సైట్ నందు ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేసుకోని, పదవ తరగతి పాసై, 14 ఏళ్లు నిండినవారు ఈనెల 21లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలువురు ఎస్సైలను శనివారం ఉన్నతాధికారులు బదిలీ చేశారు. తిరుమలాయపాలెం ఎస్‌హెచ్ఓ గిరిధర్ రెడ్డి, ఖమ్మం రూరల్ పీఎస్ ఎస్సై పులోజు కుశ కుమార్, బయ్యారం ఎస్‌హెచ్ఓ ఉపేందర్‌లను బదిలీ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో నూతన ఎస్ఐలను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు.

News July 20, 2024

ఖమ్మం: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి

image

మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. రెవిన్యూ శాఖలో ఉద్యోగులు సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

News July 20, 2024

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి: జిల్లా ఎస్పీ

image

భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అన్ని ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలన్నారు.

News July 20, 2024

భద్రాచలం: లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

భద్రాచలం నుండి 5 లక్షల 89 వేల 743 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. ఏదేని అత్యవసర సేవలకు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News July 20, 2024

భద్రాచలం: ఐటీడీఏ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.

News July 20, 2024

కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.