Khammam

News January 12, 2026

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

image

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News January 12, 2026

వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.

News January 12, 2026

ఖమ్మం: మున్సిపాలిటీల గెలుపుపై మంత్రుల ఫోకస్

image

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఏదులాపురంలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంలో ఒక్కో వార్డుకు ఐదుగురి చొప్పున జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది.

News January 11, 2026

రూ.547 కోట్ల సైబర్ మోసం.. 17 మంది అరెస్టు

image

కాల్ సెంటర్లు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి రూ.547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడిందని తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 11, 2026

మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: మంత్రి తుమ్మల

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి స్వగృహంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు

News January 11, 2026

వణుకుతున్న ఖమ్మం జిల్లా

image

ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సైతం ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రమైన చలిగాలుల ధాటికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు చలికోట్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.

News January 11, 2026

ఖమ్మం: మ్యూజియం ముచ్చట తీరేదెన్నడు?

image

ఖమ్మం జిల్లా సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుపై విద్యాశాఖ తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మ్యూజియం కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించినా, పనులు అడుగు ముందుకు పడటం లేదు. మ్యూజియం వివరాలు అందజేయాలని డీఈవో ఆదేశించి 15 రోజులు గడుస్తున్నా కిందిస్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం వీడలేదు. ప్రయోగాత్మక విద్యకు ఈ జాప్యం పెద్ద అడ్డంకిగా మారింది.

News January 10, 2026

ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలి: Dy.CM భట్టి

image

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీలు,పెండింగ్ నిధులపై కూడా చర్చించారు.

News January 10, 2026

పండక్కి ఊరెళ్తున్నారా?.. జాగ్రత్తలు తప్పనిసరి: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. విలువైన నగదు, బంగారాన్ని వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి తాళం వేసినప్పుడు ఇరుగుపొరుగు వారికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేశామని, అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘100’కు డయల్ చేయాలని తెలిపారు.

News January 10, 2026

ఖమ్మం కలెక్టర్ అనుదీప్‌కి ‘బిట్స్ పిలాని’ పురస్కారం

image

ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్‌ ప్రతిష్ఠాత్మక ‘బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్’ అవార్డు లభించింది. ప్రజా జీవిత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. గతంలో సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్, ప్రస్తుతం పాలనలో తనదైన ముద్ర వేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.