Khammam

News January 10, 2026

విద్యుత్ లైన్లకు దూరంగా.. సంక్రాంతి జరుపుకోండి: ఎస్ఈ

image

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. లోహపు పూత ఉండే చైనా మాంజా వాడటం వల్ల విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీగలకు పతంగులు చిక్కుకుంటే కర్రలతో తీయడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే 1912 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.

News January 10, 2026

ఖమ్మం: ఆడబిడ్డలకు భరోసా.. ఉచితంగా క్యాన్సర్ టీకా

image

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 14-15 ఏళ్ల వయసున్న 19,500 మంది బాలికలను గుర్తించి, వారికి వచ్చే నెల నుంచి ఉచితంగా HPV వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తయింది. యుక్తవయసులోనే ఈ టీకా వేయడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 10, 2026

ఖమ్మం: పండగ పూట జాగ్రత్త.. సీపీ సునీల్ దత్ సూచనలు

image

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి గస్తీ పెంచుతున్నట్లు వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లపై నిఘా ఉంచుతామని, ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

News January 10, 2026

KMM: ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మం ఎస్సీ స్టడీసర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఐదు నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 20 నుంచి తరగతులు ప్రారంభిస్తామని.. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 10, 2026

ఖమ్మం: 12న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక

image

ఆదిలాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఖమ్మం జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 12న నిర్వహించనున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొని జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆయన కోరారు.

News January 10, 2026

KMM: చిరుత దహనంపై ‘నిశ్శబ్ద’ దర్యాప్తు.. నిందితులెవరు?

image

ఖమ్మం జిల్లా పులి గుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం దహనం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అసలు ఏడాది కాలంగా ఈ విషయాన్ని ఎందుకు దాచారు? చిరుత గోళ్లు, చర్మం ఏమయ్యాయి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. అటవీశాఖలో అధికారుల మార్పులు జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News January 10, 2026

KMM: 35,188 మంది విద్యార్థులు.. 66 పరీక్షా కేంద్రాలు

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ థియరీ పరీక్షలకు 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సీసీలు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలన్నారు.

News January 9, 2026

ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

News January 9, 2026

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News January 9, 2026

ఎల్బీనగర్ – ఖమ్మం మధ్య ప్రత్యేక బస్సులు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్బీనగర్ నుంచి ఖమ్మంకు నేడు, రేపు ప్రత్యేక నాన్-స్టాప్ డీలక్స్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10:30 గంటల వరకు మొత్తం 8 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.