Khammam

News April 3, 2025

25,65,000 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: పొంగులేటి

image

ఖమ్మం: 25,65,000 మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ₹500 బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అటు గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామని తెలిపారు. సంవత్సరానికి సరిపడా సన్న రకం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 3, 2025

అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

image

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.

News April 3, 2025

ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్‌ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.

News April 3, 2025

ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

image

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

News April 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News April 3, 2025

యువ వికాసం అమలుకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం: యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్‌లపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జూన్ నెల నాటికి యూనిట్ల గ్రౌండింగ్ కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News April 2, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

∆}ఖమ్మం:శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి∆} ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్∆}మధిర: నిజాయితీ చాటుకున్న కండక్టర్∆}ఖమ్మం రూరల్: భూ కబ్జాలో నలుగురికి రిమాండ్∆} నేలకొండపల్లి:ట్రైన్ క్రింద పడి కానిస్టేబుల్ మృతి∆}బోనకల్ లో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి∆}ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల

News April 2, 2025

మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: డా. బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల జయంతి వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహనీయుల జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.

News April 2, 2025

కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.

News April 2, 2025

ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని పేర్కొన్నారు.