Khammam

News July 16, 2024

కడుపు నొప్పి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

image

కడుపునొప్పి తాళలేక విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోనకల్ మండల పరిధిలోనే రావినూతలలో జరిగింది. ఎస్సై కడగండ్ల మధుబాబు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి అచ్యుతరావు, నాగేంద్ర దంపతుల పెద్ద కుమార్తె రిషిత (16) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుందన్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి తాళలేక సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓ ఖమ్మంకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాక
✓ మధిరలో సిపిఎం రాజకీయ శిక్షణ కార్యక్రమం
✓ నేలకొండపల్లిలో రైతులతో శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్

News July 16, 2024

ఉపాధ్యాయురాలి సస్పెండ్‌..

image

కొత్తగూడెం బూడిదగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న తుమ్మ పద్మావతిని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ సస్పెండ్‌ చేశారు. రామచంద్రఎయిడెడ్‌ పాఠశాల ప్రవేశాలు లేకపోవటంతో 2018లో మూతపడింది. ఆ పాఠశాలలో 2004-14మధ్యకాలంలో పద్మావతి HMగా పనిచేశారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్‌ అనుదీప్‌కు ఫిర్యాదు రాగా.. ఆయన విచారణకు ఆదేశించారు. గత నెలలో నివేదిక సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్, పద్మావతిని సస్పెండ్‌ చేశారు.

News July 16, 2024

యాంటి నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు: సీపీ

image

ఖమ్మం: డ్రగ్స్​ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. డ్రగ్స్, గంజాయి సమాచారంపై 8712659123 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామన్నారు.

News July 16, 2024

బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వెంటనే దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని, ఏ వారం దరఖాస్తులను ఆవారమే పరిష్కరించాలని సూచించారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

News July 15, 2024

ఖమ్మం : పోస్టాఫీసులో 137 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఖమ్మం డివిజన్‌లో 137 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తాం: పొంగులేటి

image

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ నందు రైతు భరోసా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందో రైతులే చెప్పాలన్నారు. రైతులు సూచించిన మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

News July 15, 2024

వే2న్యూస్ కథనానికి స్పందన.. బస్సులు ఏర్పాటు

image

మణుగూరు ఏరియా సింగరేణి పాఠశాలలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇటీవల వే2న్యూస్‌లో కథనం ప్రచురించారు. స్పందించిన సింగరేణి అధికారులు సింగరేణి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న, విద్యార్థుల సౌకర్యార్థం మూడు బస్సులను సోమవారం ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించిన వే2న్యూస్, సింగరేణి అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

News July 15, 2024

ఖమ్మం: ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సందర్శించిన ఎంపీ

image

ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సోమవారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.