Khammam

News July 8, 2024

నేలపై కూర్చొని విద్యార్థులకు బోధించిన జిల్లా కలెక్టర్

image

ఏన్కూరు మండలం హిమంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపై కూర్చొని విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News July 8, 2024

నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి

image

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌‌గా పోలీసులు గుర్తించారు. 

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News July 8, 2024

ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

News July 8, 2024

ఖమ్మం మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News July 8, 2024

మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ

image

భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.

News July 8, 2024

గ్యాస్ బండ రాయితీకి తప్పని తిప్పలు

image

కొత్త సర్కారులో గ్యాస్ బండ రాయితీ వస్తుందని సంబరపడిన వినియోగదారులకు భంగపాటు తప్పడం లేదు. ఒక్కో గ్యాస్ బండకు వినియోగదారుడు సుమారు రూ.842 చెల్లిస్తున్నాడు. తర్వాత ఒకటి నుంచి ఐదు రోజుల్లో రూ.340 పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ సొమ్ము పడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కారేపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో అది జమకావడం లేదు. ఫలితంగా ఆయా వినియోగదారులు రాయితీ సొమ్మును కోల్పోవాల్సి వస్తోంది.

News July 8, 2024

డీఎస్సీ పరీక్ష గడువు పెంచండి.. భట్టికి వినతి

image

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, డీఎస్సీకి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉందని, చదువుకునేందుకు తగిన సమయం కేటాయించాలన్నారు. పరీక్షను మరో 3 నెలల అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు.

News July 8, 2024

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

image

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చర్ల మండలం కుదునూరు జీపీ బోటిగూడెంకి చెందిన కే.సరోజిని (23), కలివేరుకి చెందిన రాజేశ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సరోజిని పెళ్లి ప్రస్తావన తీసుకురాగా రాజేశ్ నిరాకరించాడు.  మనస్తాపంతో సరోజని శనివారం పురుగుమందు తాగింది. అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.