India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR:ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
సంక్రాంతి నాటికి గ్రామ పంచాయతీలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనతో గ్రామీణాల్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంచారు. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి.
జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MBNR కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి ఇండ్ల జాబితా, యజమాని, చిరునామా వివరాలు సేకరించి ఇంటికి సర్వే స్టిక్కర్ అతికిస్తామన్నారు. సర్వే నిర్వహించేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందికి ఆధార్, రేషన్, కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు తదితర సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
✔MBNR: పెట్టుబడులే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల MLAల విదేశీ పర్యటన ✔ సౌత్ జోన్ ఎంపికలు వాయిదా✔వనపర్తిలో సినీనటి అనసూయ సందడి✔పెండింగ్ బిల్లులపై.. మాజీ సర్పంచ్లు అరెస్టులు✔ప్రారంభమైన పత్తి,వరి కొనుగోలు కేంద్రాలు✔గండీడ్:రేపు 38 గ్రామాల్లో తాగు నీళ్లు బంద్✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు మీ సేవలు బంద్✔పలుచోట్ల కార్తిక శోభ.. ఆలయాల్లో భక్తుల సందడి
రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి వాహనదారుల మృతికి కారకులు కావద్దని MBNR ఎస్పీ జానకి సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి నల్లని కవర్లు కప్పడంతో రాత్రివేళలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని పేర్కొన్నారు. కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బావుల వద్దనే ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 5 నుంచి 7 వరకు లండన్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొనేందుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టూరిజం శాఖ అధికారులు లండన్ పర్యటనకు బయలుదేరారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆండర్-23 వన్డే అంతర్ జిల్లా లీగ్ కం నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ వరంగల్, మెదక్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు మొదటి మ్యాచ్ నేడు ఆదిలాబాద్ జట్టుతో, రేపు వరంగల్ జట్టుతో, 6న ఖమ్మం జట్టుతో తలబడనుంది. మెదక్లో 8న సెమీఫైనల్,9న ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కానున్నారు.
పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులందరు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిలో ఉండవెల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురవరం లోకేశ్వర రెడ్డి, మాజీ సర్పంచులు శేషన్ గౌడ్, శివరాముడు, పవిత్ర జనార్దన్ రెడ్డి, భాస్కర్, ఈదన్న, పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఉండవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. MBNR-2, NGKL-15, GDWL-1, WNPT-1, NRPT-5 జిల్లాలో పత్తి కేంద్రాలను అధికారులు అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే పత్తిని అత్యధికంగా నాగర్ కర్నూల్లో పండిస్తారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తప్పవని ఆయా జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.