Mahbubnagar

News October 1, 2025

కౌకుంట్ల: వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

కౌకుంట్ల మండల కేంద్రంలో మంగళవారం వాగు దాటుతుండగా గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇస్రంపల్లికి చెందిన అలివేలు సురక్షితంగా బయటపడగా, శాఖాపుర్‌కు చెందిన మంగలి రమేష్ మృతదేహాన్ని బుధవారం ఎస్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందం గాలింపులో కనుగొంది. వరద ఉద్ధృతికి వీరు వాగులో కొట్టుకుపోయారు.

News October 1, 2025

MBNR: నెల రోజులు 30 పోలీస్ యాక్ట్‌ అమలు

image

శాంతిభద్రతల దృష్ట్యా మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు ఎవరూ శాంతి భద్రతలకు భంగం కలిగించే, ప్రజాధనానికి నష్టం చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకూడదని ఎస్పీ హెచ్చరించారు.

News October 1, 2025

అడ్డాకుల రోడ్డు ప్రమాదంలో మృతులు వీరే!

image

అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద జాతీయ రహదారి (NH-44)పై నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులను కొత్తకోట మండలం చర్లపల్లికి చెందిన రాజు (21), గణేష్ (20)గా గుర్తించారు. మృతుడు రాజుకు రెండు నెలల బాబు ఉండగా, గణేష్‌కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ వివరాలను అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు ధ్రువీకరించారు.

News October 1, 2025

కౌకుంట్ల: వాగులో గల్లంతైన వ్యక్తి ఇతనే!

image

కౌకుంట్ల-ఇస్రంపల్లి గ్రామాల మధ్య వాగు ఉద్ధృతి కారణంగా బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరిలో ఒకరు గల్లంతయ్యారు. ఇస్రంపల్లికి చెందిన అలివేలు సురక్షితంగా బయటపడగా, అడ్డాకుల మండలం శాఖాపూర్‌కు చెందిన మంగలి రమేష్ ఆచూకీ ఇంకా లభించలేదు. పెన్షన్ పుస్తకం పోస్ట్ ఆఫీస్‌లో పెట్టడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.

News October 1, 2025

కౌకుంట్ల: యువకుడి గాలింపు చర్యలు ముమ్మరం

image

కౌకుంట్ల మండల కేంద్రంలోని ఇస్రంపల్లి వాగు కాజ్ పై యువకుడు మంగళవారం మధ్యాహ్నం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకునిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఎంపీడీఓ, పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News September 30, 2025

అడ్డాకుల: హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అడ్డాకుల మండలం పరిధిలోని శాఖాపూర్ గ్రామం వద్ద నేషనల్ హైవే 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి కర్నూలు దిశగా వెళ్తున్న పల్సర్ బైక్‌ (TS08JF5572)ను వెనకనుంచి వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News September 30, 2025

MBNR: బస్సు- బైకు ఢీ.. ఒకరి మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లి తిరుమల హిల్స్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రమాదంలో హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన రంగాచారి (30) మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఉన్న సెల్ ఫోన్‌‌ను గుర్తించిన 108 సిబ్బంది విశాల్, అక్బర్ జిల్లా ఆస్పత్రిలో స్వాధీన పరిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2025

మిడ్జిల్: పొలానికి మందు కొట్టడానికి వెళ్లి రైతు మృతి

image

మిడ్జిల్ మండల కేంద్రంలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాగుల బాలస్వామి(38) ఈ రోజు ఉదయం వరి పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లగా, జారిపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2025

బాదేపల్లి, దేవరకద్ర మార్కెట్‌ యార్డులకు దసరా సెలవులు

image

దసరా పండుగ సందర్భంగా MBNR జిల్లాలోని బాదేపల్లి, దేవరకద్ర మార్కెట్ యార్డులకు సెలవులు ప్రకటించారు. బాదేపల్లి యార్డుకు మంగళవారం నుంచి శుక్రవారం వరకు 4 రోజులు సెలవులు ఉంటాయని, తిరిగి శుక్రవారం నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని యార్డు ఛైర్‌పర్సన్ జ్యోతి తెలిపారు. దేవరకద్ర మార్కెట్‌ యార్డుకు 5 రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు.

News September 30, 2025

MBNR: రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

image

MBNR జిల్లాలో ZPTC, MPTC ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఒక్కో విడతలో ఎనిమిది చొప్పున మొత్తం 16 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో బాలానగర్, భూత్పూర్, గండేడ్, మహమ్మదాబాద్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, రాజాపూర్ మండలాల్లో పోలింగ్ ఉంటుంది. రెండో విడతలో అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర, హన్వాడ, కోయిల్ కొండ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్, మూసాపేట్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.