Mahbubnagar

News September 30, 2025

MBNR: ఎన్నికల కోడ్.. పల్లెల్లో సందడి షురూ

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికలకు నగారా మోగింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. బరిలో నిలిచే ఆశావహులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో నెల రోజుల పాటు గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి.

News September 29, 2025

MBNR: POLICE ప్రజావాణి..14 ఫిర్యాదులు

image

MBNRలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పౌరులను కలిశారు. మొత్తం 14 వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పీ సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు.

News September 29, 2025

MBNR: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధమ కర్తవ్యం

image

ప్రజా సమస్యల పరిష్కారం తమ ప్రధమ కర్తవ్యం అని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షిస్తామని వాటికి క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు తమ కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని అన్నారు.

News September 29, 2025

BCలకు రిజర్వేషన్ వరం- మంత్రి శ్రీహరి

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరం, 42శాతం రిజర్వేషన్లు వ్యతిరేకించి బీసీబిడ్డల ఆగ్రహానికి గురికావద్దు, BCలకు గురికావొద్దని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 28, 2025

మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్ మహిళకే ఖరారు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ ఛైర్మన్‌ల స్థానాలను నిన్న ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వం మహిళకు ఖరారు కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవి కోసం మరోసారి మహిళ అభ్యర్థులు రంగంలో ఉండనున్నారు. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా సీతా దయాకర్ రెడ్డి ఒక పర్యాయం పనిచేశారు. ప్రస్తుతం కూడా మహిళలకు కేటాయించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 28, 2025

MBNR: స్థానిక పోరు..ZPTC స్థానాలు ఇవే..!

image

1.మహబూబ్ నగర్-SC(జనరల్), 2.మహమ్మదాబాద్-ST(మహిళ), 3. గండీడ్-BC (మహిళ), 4. జడ్చర్ల-ST(జనరల్), 5. నవాబ్ పేట్-ST(మహిళ), 6. సీసీకుంట-SC (జనరల్), 7.అడ్డాకల్-BC(మహిళ), 8. కోయిలకొండ-BC(మహిళ), 9.భూత్పూర్-BC (జనరల్), 10.మిడ్జిల్-BC(జనరల్), 11. హన్వాడ-BC (జనరల్), 12.కౌకుంట్ల-BC (జనరల్), 13.దేవరకద్ర- జనరల్, 14. బాలానగర్- జనరల్, 15.రాజాపూర్- జనరల్( మహిళ), 16.మూసాపేట- జనరల్(మహిళ). SHARE IT.

News September 27, 2025

MBNR: పెండింగ్‌ కేసులపై ఫోకస్ పెట్టండి- SP

image

MBNRలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో జిల్లా ఎస్పీ డీ.జానకి శనివారం సమావేశం నిర్వహించారు. కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, కోర్టు లైజన్ అధికారులు ప్రతి కేసు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ.. అవసరమైన సమాచారం ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. DCRB DSP రమణా రెడ్డి,DCRB CI మగ్దూమ్ అలీ, అధికారులు పాల్గొన్నారు.

News September 27, 2025

MBNR: భారీ వర్షాలు.. రంగంలోకి ఎస్పీ

image

గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెడపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో SP D.జానకి స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. వన్ టౌన్ PS పరిధిలోని కొత్త చెరువు పరివాహక ప్రాంతాలను సందర్శించి, నీటి వృద్ధిని సమీక్షించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు జారీచేశారు. కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, DSP వెంకటేశ్వర్లు, CI అప్పయ్య పాల్గొన్నారు.

News September 26, 2025

MBNR: వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: SP

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో విద్యుత్ తీగలు, కరెంట్ షార్ట్ సర్క్యూట్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలను నీటిమీద ఆడనీయకుండా పర్యవేక్షించాలని, చెక్‌డ్యామ్‌లు, వాగులు దాటుద్దని, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 26, 2025

MBNR: పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘చాకలి ఐలమ్మ రైతు ఉద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆమె స్ఫూర్తితో సమాజంలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలి’ అని పేర్కొన్నారు. అదనపు AR ఎస్పీ సురేష్ కుమార్, DSP AR శ్రీనివాసులు, AO రుక్మిణి భాయి, సిబ్బంది పాల్గొన్నారు.