India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్‌లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.

యువత వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ -2025లో పాల్గొనుటకు ఈనెల 30లోపు రిజిస్టేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. కంప్యూటర్ ట్రేడ్స్‌కు 16-24లోపు ఉండాలని, ఈ పోటీలో జిల్లా, రాష్ట్ర, నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దాదాపు 56కి పైగా నైపుణ్యాలలో పోటి పడొచ్చన్నారు. Web:https://www.skillindiadigital.gov.in.

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

MBNR(D) నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్‌పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.