India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ ఉద్యోగిపై దాడి జరిగిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. ఎస్ఐ కురుమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని రాచూరు గ్రామానికి చెందిన హైమావతి ఇందిరా క్రాంతి పథకంలో వీవోఏగా పనిచేస్తోంది. గంగదారి కృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు రుణ విషయంలో హైమావతిని అసభ్యంగా మాట్లాడి, దాడి చేశారని PSలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు కృష్ణయ్యపై నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మిడ్జిల్‌లో 36.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట జిల్లాలోని ధన్వాడలో 35.9, మదనపూర్‌లో 35.9, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో 35.5, అలంపూర్‌లో 35.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్మశాలి విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్, నీట్ పరీక్ష ప్రతిభ కబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆదివారం అందజేశారు. విద్యార్థులకు నగదు బహుమతి, సర్టిఫికెట్, మెమెంటో అందజేశారు. నిరంతం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని సంఘం నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మండలంలోని గుదిబండ గ్రామంలో భార్య, అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశారు. అత్తకు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా తన భార్యను కాపురానికి పంపడం లేదని అతడు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనెల 29న పాలమూరు యూనివర్సిటీలో స్త్రీ, పురుషుల చెస్, పురుషుల విభాగంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పీయూ PD శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. 17-25 ఏళ్ల వయసు ఉండి, చదువుతున్న కళాశాల బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు సౌత్ జోన్/ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ తమిళనాడులో పాల్గొంటారని సూచించారు.
ఈ నెల 31 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమరచింత పద్మశాలీలు ఆదివారం పట్టణంలోని మార్కెట్ స్వామి దేవాలయంలో స్వామికి పట్టు వస్త్రాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పాఠశాల పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలన విధానం తదితర అంశాలపై అభివృద్ధి కోసం ఇటీవల ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలానికి ఒక MEOను నూతనంగా నియమించారు. కాగా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈనెల 29నHYDలో ఒక్కరోజు శిక్షణ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ అంశాల పర్యవేక్షణ MEOలకు పై శిక్షణ ఇవ్వనున్నారు.
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివ(25) అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శివ మృతికి కారణం మహిళతో వివాహేతర సంబంధమా, లేక మరేమైన కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శంకర్ నాయక్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణకు అవసరమయ్యే సామాగ్రిని గోదాములో భద్రపరిచారు. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.