India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MBNRలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 13 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టేలా సూచనలు ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి అభ్యర్థనపై పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి ఉంటామన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో సెప్టెంబర్ 01 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP జానకి వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతతను పెంపొందించేందుకు నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు చేపట్ట రాదని, నిషేదిత ఆయుధాలు వాడరాదని, లౌడ్ స్పీకర్‌లు, డీజేలు నిషేధమన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

ఉత్సవాల పేరుతో మద్యం తాగి హంగామా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. నిమజ్జన ఘాట్ల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతకు సహకరించాలన్నారు.

విద్యార్థులు కొత్త టెక్నాలజీను నేర్చుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం MBNRలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా మహబూబ్‌నగర్ రూరల్ PS పరిధిలో 300, అత్యల్పంగా మిడ్జిల్ PS పరిధిలో 88 రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అన్ని వినాయక మండపాల జియో-ట్యాగింగ్ పూర్తి నిమజ్జన రూట్‌మ్యాప్‌తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

వినాయక నిమజ్జనానికి వెళ్లి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం బోడ జానంపేటలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం కావేరమ్మపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు BSCPL క్రషర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కంపెనీలో ఉన్న గణేశుని నిమజ్జనం చేశారు. ప్రమాదవశాత్తు ఆంజనేయులు గుంతలో పడ్డాడు. శుక్రవారం నుంచి గాలించగా శనివారం సాయంత్రం
అతని మృతదేహన్ని బయటికి తీశారు.

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.