India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వైద్యులను ఆదేశించారు. బుధవారం మూసాపేట మండల పరిధిలోని జానంపేట పీ.హెచ్.సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల వైద్య చికిత్సను పరిశీలించి సమస్యలపై రోగులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023 (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి బుధవారం తెలిపారు. 12,769 మంది విద్యార్థులకు 60 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.
రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం బిల్లు బీసీ రాజ్యాధికారానికి తొలిమెట్టు అని బీసీ సమాజ్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీని అమలు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బడ్జెట్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యం,ఉపాధి, రైతు, కార్మిక, ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, తెలంగాణ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి కృషితో ప్రజల అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఇటీవల కామెర్లు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ మృతిచెందింది. దీంతో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. వీసీ మాట్లాడుతూ.. నందిని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.
ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలోని వనమోనిగూడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. లత గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 16న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.