India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో పాలమూరు విశ్వవిద్యాలయం పరిధి గద్వాలలోని పీజీ సెంటర్‌లో 2017-2019లో MA తెలుగు పూర్తి చేసిన S.రాకేశ్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటి ఓపెన్‌లో ఉద్యోగం సాధించారు. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC), ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ రాకేశ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా.సంధ్యారాణి పాల్గొన్నారు.
శిశు గృహాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండెజ్ ఫౌండేషన్, జీజీహెచ్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. చిన్నారులు ఇంటి వాతావరణం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశు గృహాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.
ఇక నుంచి దివ్యాంగుల కోసం వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష సమావేశం 183 మందికి దివ్యాంగులకు రూ.16 లక్షల విలువైన సహాయ పరికరాలను ఉచితంగా అందజేశారు. అంగ వైకల్యం కలిగిన ఎంతోమంది తమ వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని కలెక్టర్ గుర్తు చేశారు.
బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీసీ సంఘాల ముఖ్యపాత్ర ఉందని బీసీ ఐక్యవేదిక ఉద్ఘటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ MBNRలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగులు న్యూటౌన్‌లోని మల్లికార్జున్ ఎంటర్ప్రైజెస్ వెనుక ఉన్న ‘PMKK సెంటర్’లో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థల్లో 500 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, SSC, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై వారు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వయస్సు 18-30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వివరాలకు 9948568830, 9959635813లో సంప్రదించాలన్నారు.
సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ లింగంపేట శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడ్డ నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్-25 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ మనీతోపాటు సర్టిఫికెట్స్, మెమొంటోస్‌లను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
MBNR జిల్లా గండీడ్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి బీమా క్లైమ్ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. నకిలీ స్టాంపులతో బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయట పడిందన్నారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పారు.
జడ్చర్ల మండలంలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్త, మామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.