India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ గ్రామ సమీపంలో రైతు పండుగ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
రైతుపండగ ముగింపు సభ కోసం నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సీఎం తన X ఖాతలో ‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి ‘మార్పు’ కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది’ అని పోస్టు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, రుణమాఫీ కానీ రైతులకు మాఫీ, పలు అంశాలపై ఉమ్మడి జిల్లా ప్రజలకు హామీలు కురిపించనున్నారు.
అమిస్తాపూర్‌లో కాంగ్రెస్ ప్రజాపాలన ‘రైతు పండగ’కు సర్వం సిద్ధంమైంది. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు లక్షమంది రైతులు పాల్గొనేలా నాయకులు ప్లాన్ చేశారు. ఆసక్తిగల రైతులను ఏఈవోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సుల్లో ప్రదర్శన తీసుకెళ్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతులు, నాయకులు ప్రత్యేక వాహనాల్లో అమిస్తాపూర్‌కు బయలుదేరారు. సీఎం రేవంత్ సాయంత్రం 4.30కి సభలో పాల్గొంటారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు సమస్యలతో రుణమాఫీ కానీ 40,759 మంది రైతులకు గాను రూ.381.56 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా అత్యధికంగా NGKL జిల్లాలో 11,960, MBNR-8462, GWL-8262, WNPT-5,086, NRPT-6989 రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. వీటిని నేడు రైతు పండుగ సభలో సీఎం ప్రకటించనున్నారు.
నేడు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండగ’కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 3:30కి భూత్పూరు చేరుకుంటారు. 4:15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని 4:30గంటలకు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాల వల్ల మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన సాగునీటి, పౌరసరఫరాల, వ్యవసాయసాయ రంగాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు , ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో రైతులను చాలా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రుణ మాఫీ విషయంలో రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని అన్నారు.
ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు రైతు పండుగలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,లాభాదాయకమైన వ్యవసాయ పద్ధతులు, వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.