Mahbubnagar

News August 22, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో 1,24,153 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. అవుట్ ఫ్లో 42,898 ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 883. 50 ఉంది. ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారు.

News August 22, 2024

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలి: జూపల్లి

image

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ టిపిసిసి ఆధ్వర్యంలో HYD ఈడి ఆఫీస్ ముందు చేపట్టిన నిరసనలో జూపల్లి పాల్గొని మాట్లాడారు. ప్రజల సొమ్మును ప్రధాని మోదీ ఆదానికి దోచిపెడుతున్నారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను బయటకు తీయాలని మంత్రి డిమాండ్ చేశారు.

News August 22, 2024

గన్ పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి

image

అదానీకి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పాల్గొని మాట్లాడారు. ఈ దేశ ప్రధానమంత్రి పెద్ద పారిశ్రామికవేత్తలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని విమర్శించారు. అదానీపై ఉన్న ప్రేమ ఈ దేశ పేద ప్రజలపై లేదని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News August 22, 2024

మక్తల్: రుణమాఫీపై నెలకొన్న గందరగోళం

image

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల పట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. మక్తల్ మండల పరిసర గ్రామాల్లోనీ రైతులకు, బ్యాంకు అధికారులు ఒకలా, వ్యవసాయ అధికారులు మరొక లాగా చెప్పడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

News August 22, 2024

హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా

image

HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ‌పై కేటీఆర్‌ పిలుపు మేరకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

News August 22, 2024

నాగర్‌కర్నూల్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం విధులలో చేరిన ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఇబ్బంది పడడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అతను కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు.

News August 22, 2024

పంచాయితీ ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి షెడ్యూల్ విడుదల

image

NGKL: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల వల్ల ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 6న ప్రచురిస్తారు. జాబితాపై 13 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తొమ్మిది పది తేదీలలో రాజకీయ పార్టీల సూచనలు తీసుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

News August 22, 2024

MBNR: 1041 మంది మహిళలపై అత్యాచారం

image

రాష్ట్రంలో మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, పోక్సో, అదృశ్యం జనవరి నుంచి కేసుల నమోదు వివరాలు. ‌మహబూబ్‌నగర్‌లో 406, వనపర్తిలో 230, గద్వాల జిల్లాలో 157, నారాయణపేట్ 152, నాగర్ కర్నూల్‌లో 96 పోక్సో, అత్యాచారం, అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చట్టాలు కఠినంగా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

News August 22, 2024

MBNR: చిన్నారి గొంతు కోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి

image

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి గొంతు కోసి పరారైన ఘటన MBNR పట్టణంలో జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. శ్రీనివాస్ కాలనీకి చెందిన బాలిక ప్రైవేటు పాఠశాలలు 5వ తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పిల్లలతో కలిసి పార్కులో ఆడుకుంటోంది. అనంతరం ఇంటికి వచ్చింది. ఇంట్లో వారు కోడి రాలేదని వెతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. కేసు నమోదైంది.

News August 22, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి 57, 500 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగిందని, 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా 20,760, విద్యుదుత్పత్తి నిమిత్తం 39,442 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి మొత్తం 62,264 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.296 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.