India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్‌లైన్‌లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల అలంకరణతో మొదటి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

మన్యంకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల ముడా నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కొండపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

MBNR జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కోర్ట్ డ్యూటీ, కోర్ట్ లైజన్ అధికారులతో ఎస్పి డి.జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరుగేలా పోలీస్ అధికారులు సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కోర్ట్ డ్యూటీ, లైజన్ అధికారులకు సంబంధిత ఫైళ్లు, సాక్షులు, పత్రాలు సమయానికి కోర్టులో సమర్పించే విధంగా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం హన్వాడ మండలంలో కెజీబీవీని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో కెజీబీవీని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో విద్యా బోధన, భోజనం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్‌పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్‌లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.

జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఆయనను ‘దొంగ’గా సంబోధించడంపై కృష్ణయ్య ఆగ్రహించారు. అయితే, మండల అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని DCC నాయకులు అంటున్నారు. ఈ ఘటన పాలమూరు కాంగ్రెస్‌లో విభేదాలను తీవ్రతరం చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్ విధానాలు, సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.