India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అమలులో ఉన్నట్లు జిల్లా అధికారి హేమ భార్గవి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వం, ప్రైవేట్ ప్రతి యజమాని లైంగిక వేధింపులు లేని కార్యాలయాన్ని అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గత ఫిర్యాదులు, కార్యాలయంలో లైంగిక వేదింపుల ఫిర్యాదులను పరిష్కారం కోసం ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఎటువంటి లాభం ఉండదని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని” అన్నారు. రాజీ పడితే ఇరువురూ గెలుస్తారని, కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని స్పష్టం చేశారు. ప్రజలు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిట్కూల్ గ్రామానికి చెంది భవానిపల్లి కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లి గడ్డి కోత మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలు చేశామని అన్నారు.తన పుట్టక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ అన్నారు

టేక్మాల్ మండలం ధనురా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత, విద్య బోధన తదుపరి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడి పాటలు బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రియాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.

ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ సూచించారు. ఓ కళాశాలలో జిల్లాలోని అన్ని ప్రైవేట్, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్ స్పైర్ నామినేషన్లపై అవగాహన కల్పించారు. ఈనెల 15లోపు 5 నామినేషన్లు రావాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.