Medak

News April 1, 2026

మెదక్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

మెదక్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News March 31, 2026

పథకాల వివరాలు ప్రజలకు వివరించాలి: భట్టి విక్రమార్క

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.

News March 31, 2026

మెదక్: 33మంది హజ్ యాత్రికులకు టీకా

image

మెదక్ జిల్లా నుంచి ఎంపికైన 33 మంది హజ్ యాత్రికులకుమంగళవారం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక “టీకా శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరంలో యాత్రికులకు సంబంధించిన అన్ని రకాల అవసరమైన వైద్య పరీక్షలు చేసి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతా దేవి, జిల్లా వ్యాక్సిన్ అధికారి మాధురి, జిల్లా హజ్ కో-ఆర్డినేటర్ మహమ్మద్ ఎజాజుద్దీన్ పాల్గొన్నారు.

News March 31, 2026

హనుమాన్ జయంతికి పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని హనుమాన్ దేవాలయాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

News March 31, 2026

మెదక్: ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి

image

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మహేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ రోజు పదోన్నతి పొందడం ఆనందంగా ఉందన్నారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు.

News March 31, 2026

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమల్లో ఉంటుందని ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 31, 2026

మెదక్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి సెలక్షన్స్

image

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి సెలక్షన్స్ మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించారు.
జిల్లాలోని వివిధ మండలాల నుంచి 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రమేశ్ గంగాల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో చేరుటగాను జిల్లాలోని మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించారు.

News March 31, 2026

ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. రైతు భరోసా, బీమా, రుణమాఫీ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

News March 31, 2026

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి: ఎస్పీ

image

చేగుంటలో “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటింపు తప్పనిసరి అన్నారు. ద్విచక్ర వాహనదారులు ISI హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరి అని సూచించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు.