Medak

News March 30, 2026

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

2027 జనగణన ప్రక్రియను జిల్లాలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈసారి జనగణన రెండు దశల్లో జరుగుతుందని.. మొదటి దశలో గృహాల వివరాలు, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటుందని వివరించారు. ఈ సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందన్నారు.

ప్రమాదాలు విధి కాదు – నిర్లక్ష్య ఫలితం: ఎస్పీ శ్రీనివాసరావు

image

రోడ్డు ప్రమాదాలు దైవ నిర్ణయం కాదని, అవి కేవలం మన నిర్లక్ష్య ఫలితమేనని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మనోహరాబాద్‌లో నిర్వహించిన “Arrive Alive” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో గతంలో 287 మరణాలు, 631 గాయాలు నమోదు కావడం ఆందోళనకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కవచాలని సూచించారు.

News March 30, 2026

మెదక్: బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు: ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ 8712657888కు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 30, 2026

మెదక్: మోసాలపై 1930కు ఫిర్యాదు చేయండి: ఎస్పీ

image

మెదక్ జిల్లా జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ పెండింగ్ కేసులు రాజీ ద్వారా పరిష్కరించారు. మొత్తం 485 ఐపీసీ & BNS కేసులు, 86 సైబర్ క్రైమ్, 90 ఈ-పెట్టి, 527 డీడీ&ఎంవీ యాక్ట్ కేసుల్లో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. సైబర్ మోసాల్లో కోల్పోయిన ₹27.57 లక్షలను 86 కేసుల్లో బాధితులకు తిరిగి అందించారు. ఎస్పీ సిబ్బందిని అభినందిస్తూ, సైబర్ మోసాలకు 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 29, 2026

మెదక్ చర్చిలో మట్టల పండుగ వైభవం!

image

మెదక్ చర్చిలో ఆదివారం మట్టల పండుగ భక్తిశోభతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తజన సందోహం వెల్లువలా చేరి ప్రాంగణాన్ని నింపింది. చర్చి ఆవరణలో మట్టలతో భక్తిగీతాలు ఆలపించారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగిన ఊరేగింపు హృదయాలను హత్తుకుంది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు భక్తిరసంలో మునిగిపోయారు. మట్టల పండుగ విశ్వాస వైభవానికి చిహ్నంగా నిలిచింది.

News March 29, 2026

చేగుంట: విధుల్లో ఉన్న పోలీసులపై దాడి.. ముగ్గురు అరెస్ట్

image

విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కారులో రాంగ్ రూట్‌లో వచ్చి వాహనాన్ని అడ్డంగా నిలిపారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్, పవన్, బాలాజీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 29, 2026

ఏడుపాయలలో కాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి

image

మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల వసతి కోసం 12 కాటేజీల నిర్మాణానికి రూ. 7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టూరిజం అధికారులను కోరారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అధికారులకు లేఖ రాశారు.

News March 29, 2026

మెదక్: జ‌న‌గ‌ణ‌నపై అదనపు కలెక్టర్ నగేష్ దిశానిర్దేశం

image

సమీకృత కలెక్టరేట్‌లో జనగణన-2027 ఫేస్-1(గృహ గణన) పై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మాట్లాడుతూ.. జనగణన నాణ్యత క్షేత్రస్థాయి కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాలని ఫీల్డ్ టీమ్‌లను ఆదేశించారు. డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.